గత నవంబర్లో ఎప్పట్లాగే వాల్ట్ డిస్నీ వరల్డ్ మహిళా ఉద్యోగులు... మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్ వేషాలు వేసుకొని... టూరిస్టులను పలకరించారు. ఐతే... ఒక్కసారిగా టూరిస్టులు గుంపులుగా వచ్చేయడంతో... గందరగోళం ఏర్పడింది. ఆ గుంపులో ఓ ముసలావిడ వల్ల ముగ్గురిలో మిక్కీ మౌస్ వేషం వేసుకున్న మహిళకు మెడ దగ్గర గాయమైంది. దాంతో... ఆమె అదే కాస్టూమ్స్లో ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో... మిన్నీమౌస్, డొనాల్డ్ డక్ వేషాలు వేసుకున్న మహిళల్ని... టూరిస్టుల్లో ఆకతాయిలు చుట్టుముట్టి వెధవ్వేషాలు వేశారు. తమను ఎక్కడెక్కడో టచ్ చేశారని ఆ ఇద్దరు మహిళలూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గుంపులో ఓ 50 ఏళ్ల పర్యాటకుడు... తన వక్షోజాల ప్రదేశంలో మూడుసార్లు టచ్ చేశాడని ఓ మహిళ కంప్లైంట్లో తెలిపింది. దీనిపై రహస్య దర్యాప్తు చేసిన పోలీసులు... 51 ఏళ్ల ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఫొటో తీసుకుంటానని బాధితురాలి దగ్గరకు వచ్చిన అతడు... ఆమెను ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్న డిస్నీ యాజమాన్యం... తమ ఉద్యోగుల రక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యమని తెలిపింది. ఉద్యోగుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే తమకు కంప్లైంట్ ఇవ్వాలని కోరింది.
Published by:Krishna Kumar N
First published:December 28, 2019, 10:18 IST