హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు, ఆపై మీరట్ రేప్ కేసు, నిన్న గాక మొన్న ఝాన్సీలో ఇంటర్ విద్యార్థినిపై రేప్.. ఇలాంటి ఘటనలు మరువకముందే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అక్కడ మహిళల భద్రతపై సందేహాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక మహిళను రేప్ చేసి.. (!), ఆ పై హత్యకు పాల్పడ్డాడో నిందితుడు. అయితే ఆమెను చంపిన ఆ దుర్మార్గుడు.. ఆ మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలన్నింటినీ ఒక సంచిలో కట్టి.. శ్మశానవాటికలో పడేశాడు నిందితుడు. ఆ శ్మశానవాటిక కూడా పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉండటం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
సోమవారం సాయంత్రం మీరట్ లోని లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్మశానవాటికలో రక్తం కారుతున్న ఒక సంచి కనిపించింది. అది చూసిన అక్కడి కుక్కలు దానిని లాగి బయటకు తీశాయి. మాంసపు ముద్దలను నీటిలో ముంచి తింటున్న ఘటనను స్థానికంగా ఉండే చిన్న పిల్లలు చూశారు. ఇది వారి తల్లిదండ్రులకు చెప్పగా.. వాళ్లు అనుమానమొచ్చి పోలీసులకు సమాచారమందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు.. ఆ సంచిని ఓపెన్ చేయగానే అందులోంచి నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహాం.. తలలేదు. మొండెం ఒకటే ఉంది. అదీ 15 ముక్కలుగా కోసి ఉంది. ఇది చూడంగానే ఆ సంచి తెరిచిన కానిస్టేబుల్ కండ్లు తిరిగి అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. ఆ మృతదేహాం చూడంగానే చాలా మంది పరిస్థితి అదే విధంగా మారింది. పోలీసులు ఆ బాడీని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
రేప్ చేశాడా..?
ఈ ఘటనపై ఎస్పీ అఖిలేశ్ నరేన్ సింగ్ స్పందిస్తూ.. 35 ఏళ్ల లోపు వయసున్న మహిళకు సంబంధించిన బాడీగా దానిని గుర్తించామని తెలిపారు. అయితే తల లేనందువల్ల ఆమె ఎవరనేదానిమీద స్పష్టత లేదన్నారు. హంతకుడు తల, మొండేన్ని వేరు చేసి.. బాడీని 15 ముక్కులుగా పడేశారని అన్నారు. మహిళ శరీరం మీద బట్టలు లేవనీ, ఆమెను రేప్ చేసిన తర్వాతే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామని చెప్పారు. శ్మశానంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని, స్థానికంగా ఉండేవారిని విచారిస్తూ.. వారి దగ్గర్నుంచి సమాచారం సేకరిస్తున్నామని నరేన్ తెలిపారు.
అయితే హంతకుడు ఈ మృతదేహాన్ని వేరే చోట చంపి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకొస్తాయని వారు చెబుతున్నారు. కాగా.. అత్యంత హేయంగా మహిళను రేప్ చేసి.. హత్య చేసిన దుండగుడిని వదిలిపెట్టొద్దని స్థానికులు కోరుతున్నారు. నిందితుడిని పట్టుకుని అతడిని ఉరిశిక్ష విధించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder, Up news, Uttarpradesh