Home /News /crime /

DISHA MURDER CASE HYDERABAD CITY APPREHENDED ONE PERSON WHO MADE VULGAR COMMENT ON FACEBOOK SK

దిశాపై అభ్యంతరకర పోస్టులు.. నిజామాబాద్‌ యువకుడి అరెస్ట్

యువకుడు అరెస్ట్

యువకుడు అరెస్ట్

షాద్‌నగర్ హత్యాచార ఘటన బాధితురాలు దిశాపై ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    దిశా హత్యాచార ఘటనపై యావత్ భారతం భగ్గుమంటోంది. దిశాను హత్యచేసిన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తోంది. జస్టిస్ ఫర్ దిశా అంటూ జనాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. దిశాకు జరిగిన అన్యాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ కొందరు కేటుగాళ్లు మాత్రం దిశాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. కనీస మానవత్వం మరిచి ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు.

    ఇలా దిశాపై ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టులు చేసిన యువకుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన చవన్ శ్రీరామ్ అనే 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ హత్యాచార ఘటన బాధితురాలు దిశాపై ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితురాలు ఫొటోలను కూడా వాడకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల పట్ల పటిష్ట నిఘా పెట్టామని.. హద్దు మీరితే జైలుకెళ్తారని వార్నింగ్ ఇచ్చారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Disha murder case, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు