రేప్ కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష.. విజయవాడ కోర్టు సంచలన తీర్పు

ఈ కేసులో గతేడాది ఫిబ్రవరిలో నిందితుడు సైకం కృష్ణారావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు అతడిని దోషిగా తేల్చి 20 ఏళ్లు జైలు శిక్ష విధించిం

news18-telugu
Updated: December 3, 2019, 12:08 AM IST
రేప్ కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష.. విజయవాడ కోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది జనవరిలో విజయవాడలో ఓ మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అనారోగ్యం కారణంగా ఆ బాలిక తల్లితో కలిసి ఉయ్యూరు నుంచి ఇబ్రహీంపట్నం చికిత్స  కోసం వచ్చింది. వరసకు కూతురయ్యే ఆ మైనర్ బాలికపై కృష్ణారావు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ కేసులో గతేడాది ఫిబ్రవరిలో నిందితుడు సైకం కృష్ణారావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు అతడిని దోషిగా తేల్చి.. 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కాగా, శంషాబాద్ దిశా రేప్ అండ్ మర్డర్ కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పశు వైద్యురాలిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా చంపిన నలుగురు నిందితులను ఉరితీయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేప్ కేసు దోషికి 20 ఏళ్ల పాటు శిక్ష విధించడంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే దిశా కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి.
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>