Home /News /crime /

DISHA ENCOUNTER VICTIMS APPROACHES DISHA COMMISSION AND EXPRESS DOUBTS ON LORRY OWNER SRINIVAS SK

Disha Case: దిశా కేసులో సంచలన ట్విస్ట్.. లారీ ఓనర్‌పై అనుమానాలు

దిశా కేసు నిందితులు

దిశా కేసు నిందితులు

Disha case: చెన్న కేశవులు తండ్రి కుర్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్‌లో హత్య చేశారని వారు ఆరోపించారు. దిశా అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటపెడతామని పేర్కొన్నారు.

    2019 ఆఖరులో దిశా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారులో దిశను నలుగురు యువకులు దిశను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఈ కేసుపై అప్పట్లో దేశమంతటా చర్చ జరిగింది. ఐతే నిందితులు నలుగురినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఆ తర్వాత దిశా కేసును అందరూ మరిచిపోయారు. దిశా హత్యాచార ఘటన దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఇన్ని రోజుల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల కుటుంబ సభ్యులు దిశ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు ప్రాణ ఉందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాల్సిదిగా కొందరు ప్రలోభ పెడుతున్నారని.. అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబ సభ్యులు దిశ కమిషన్‌కు తెలిపారు.

    అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన మృతుల కుటుంబ సభ్యులు.. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ కేసులో అనుమానాలున్నాయని తెలిపారు. కుర్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్‌లో హత్య చేశారని ఆరోపించారు. దిశా అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటపెడతామని పేర్కొన్నారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకుంటే రూ.25 లక్షలు ఇస్తామని కొందరు ప్రలోభ పెడుతున్నట్లుగా వివరించారు. తమకు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం ఉందని.. ఆయన్ను విచారించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

    కాగా, నవంబరు 27న పశు వైద్యురాలు దిశ (పోలీసులు పెట్టిన పేరు)పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. ఐతే డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. దీనిపై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబరు 6న ఎన్‌కౌంటర్ జరిగితే.. డిసెంబరు 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.

    వారి అంత్యక్రియలు జరిగిన 3 రోజులకే చెన్న కేశవులు తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై వెళ్తున్న కుర్మయ్య గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయపడిన కుర్మయ్య హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదం తర్వాత అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరకు 2020 మార్చి 9న ఇంట్లోనే కుర్మయ్య చనిపోయారు. ఆయన మృతికి మూడు రోజుల ముందు అంటే మార్చి 6న చెన్న కేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఐతే ఈ కేసు ఇన్ని రోజుల తర్వాత మలుపు తిరగడంతో సర్వత్రా మళ్లీ చర్చనీయాంశమయింది. కేసుకు సంబంధించి కీలక విషయాలను బయటపెడతామన్న మృతుల కుటుంబ సభ్యులు.. ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Disha accused Encounter, Disha murder case, Telangana

    తదుపరి వార్తలు