దిశ కేసులో నిందితుల మృతదేహాలకు పంచనామా పూర్తి... కాసేపట్లో పోస్ట్‌మార్టం

Disha Case Encounter : దిశ కేసు ఎన్‌కౌంటర్‌లో మృతులకు ఇప్పుడే పంచనామా పూర్తైంది. ఇక పోస్ట్ మార్టం మిగిలివుంది.

news18-telugu
Updated: December 6, 2019, 12:57 PM IST
దిశ కేసులో నిందితుల మృతదేహాలకు పంచనామా పూర్తి... కాసేపట్లో పోస్ట్‌మార్టం
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలం
  • Share this:
Disha Case Encounter : తెలంగాణలో దిశ హత్యాచారం, హత్య కేసులో షాద్‌నగర్‌లోని చటాన్ పల్లిలో... పడివున్న మృతులు (నిందితులు) ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ డెడ్ బాడీలకు క్లూస్ టీమ్ శవ పంచనామా పూర్తి చేసింది. డెడ్ బాడీలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఉదయం 3న్నరకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత క్లూస్ టీమ్ రంగంలోకి దిగేటప్పటికి ఉదయం 8 గంటలైంది. ఆ తర్వాత క్లూస్ టీమ్ ఘటనా స్థలిలోకి ఎవరూ ఎంటరవ్వకుండా జాగ్రత్తలు తీసుకంది. చుట్టూ డోంట్ క్రాస్ టేప్స్ పెట్టి... దర్యాప్తు సాగించింది. ఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలు, బుల్లెట్లు, నిందితుల మృతదేహాలు పడివున్న తీరు, చుట్టుపక్కల వాతావరణం అన్నింటినీ లెక్కలోకి తీసుకుంది. ఫొటోలు, వీడియోలూ తీసింది. అలాగే... అన్ని ఆధారాలూ సేకరించింది. ఇక ఇప్పుడు మృతదేహాలకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోస్ట్ మార్టం ఉంటుంది. అందులో పూర్తి నివేదిక రెడీ చేస్తారు. ఆ లెక్కన సాయంత్రానికి పోస్ట్ మార్టం పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ రిపోర్ట్ కోరడంతో... పోలీస్ శాఖ ఆ రిపోర్ట్‌పై దృష్టి సారిస్తోంది.
First published: December 6, 2019, 12:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading