DISHA CASE ACCUSED RE POSTMORTEM COMPLETED IN GANDHI HOSPITAL SK
దిశా నిందితుల రీ పోస్టుమార్టం పూర్తి.. సాయంత్రం అంత్యక్రియలు
దిశ నిందితులు
నలుగురు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, శివ బాడీలో ఒక బుల్లెట్ గాయం ఉన్నట్టు సమాచారం.
దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం పూర్తయింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్ గాంధీ ఆస్పత్రిలో రీపోస్టు మార్టం నిర్వహించింది. ఇందులో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. రీ పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారు. నలుగురు నిందితుల రీ పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిపుణు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పిస్తారు.
పోస్టుమార్టం అనంతరం నలుగురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ధృవీకరణ పత్రంపై కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొని.. అనంతరం అప్పగించారు. భారీ భద్రత నడుమ నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాలకు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు నలుగురు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, శివ బాడీలో ఒక బుల్లెట్ గాయం ఉన్నట్టు సమాచారం.
కాగా, డిసెంబరు 6న దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. పోలీసుల జరిగిన ఎదురుకాల్పులో వారు చనిపోయారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.