DISHA CASE ACCUSED RE POST MARTEM WILL BE ON MONDAY 9AM BA
నేడు దిశ నిందితుల రీ పోస్టుమార్టం, అంత్యక్రియల సమయం ఖరారు..
దిశ కేసు నిందితులు
సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ విజ్ఞప్తి మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్.. ఆదివారం సాయంత్రానికే హైదరాబాద్ చేరుకుంది. డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సోమవారం ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో రీపోస్టుమార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్ను సీల్డ్ కవర్లో భద్రపరుస్తారు.
రీపోస్టుమార్టం పూర్తయిన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.