హోమ్ /వార్తలు /క్రైమ్ /

దిశ కేసులో నిందితుల కుటుంబాలు సంచలన డిమాండ్...

దిశ కేసులో నిందితుల కుటుంబాలు సంచలన డిమాండ్...

దిశ కేసు నిందితులు

దిశ కేసు నిందితులు

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఎక్స్ ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్, కస్టోడియల్ డెత్ కింద నాలుగు కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషన్ వేశారు. సతీష్, కృష్ణమూర్తి అనే ఇద్దరు న్యాయవాదుల ద్వారా నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ఇప్పటికే మరో న్యాయవాది ఈ అంశం గురించి సుప్రీంకోర్టులో ప్రతిపాదించారు. అయితే, అప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదను తిరస్కరించింది.

నవంబర్ 27న రాత్రి దిశపై అత్యాచారం జరిగింది. నిందితులు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి చంపేశారు. అనంతరం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే, తమ వాళ్లు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్షించాలి కానీ, ఇలా చంపేయడం ఏంటని బాధితుల కుటుంబసభ్యులు ప్రశ్నించారు. దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్ రంగంలోకి దిగి ప్రత్యక్షంగా విచారణ జరిపింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ మీద గతంలో ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

First published:

Tags: Disa Rape and Murder, Disha murder case

ఉత్తమ కథలు