దిశ హంతకులు గతంలోనూ ఇలాంటివి చేశారా?... తవ్వుతున్న పోలీసులు...

ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 మధ్య దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నిందితులు చనిపోయారు. ఓ ఎస్ఐ, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.

news18-telugu
Updated: December 6, 2019, 3:42 PM IST
దిశ హంతకులు గతంలోనూ ఇలాంటివి చేశారా?... తవ్వుతున్న పోలీసులు...
దిశా హత్య కేసు నిందితులు
  • Share this:
హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులు నలుగురికి గతంలో కూడా నేరచరిత్ర ఉండొచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మహిళలు మిస్సింగ్, కాల్చిపడేసిన మహిళల మృతదేహాల కేసులు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయేమోనని వివరాలు సేకరిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. ఈ నలుగురు నిందితుల డీఎన్ఏలు ఇప్పటికే సేకరించామని, పాత కేసులతో ఏమైనా వివరాలు తెలిస్తాయేమో విచారణ జరుపుతామని చెప్పారు.

ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 మధ్య దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగింది. కేసు విచారణ కోసం పోలీసులు దిశను కాల్చిచంపిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత ఇద్దరు నిందితులు పోలీసుల వద్ద నుంచి గన్‌లు లాక్కొని పోలీసుల మీదే కాల్పులు జరిపారని సజ్జనార్ తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రాణరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్టు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు చనిపోయారు. ఓ ఎస్ఐ, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>