మరో వారంలో మొత్తం కుళ్లిపోనున్న దిశ నిందితుల మృతదేహాలు

దిశా హత్య కేసు నిందితులు

దేశంలో ఇతర ఆస్పత్రుల్లో అయినా భద్రపరచడానికి అవకాశం ఉందా అని హైకోర్టు గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్‌ను ప్రశ్నించింది.

  • Share this:
    దిశపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నేరానికి నలుగురు నిందితుల్ని ఈనెల 6వతేదీన చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ ఘటన జరిగి 16 రోజులు కావస్తోంది. అయినా ఇప్పటివరకు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు మాత్రం పూర్తికాలేదు. ఎన్‌కౌంటర్ పై హైకోర్టు, సుప్రీంకోర్టుల విచారణ జరుగుతుండటంతో నలుగురు డెడ్ బాడల్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. అయితే ఇవాళ మృతదేహాల భద్రత విషయంలో కోర్టు విచారణకు హాజరయ్యారు గాంధీ ఆస్పత్రి సూపరెండెంట్ శ్రావణ్. ఈ సందర్భంగా నలుగురు మృతదేహాలు 50 శాతం డీకంపోజ్ అయ్యాయని కోర్టుకు తెలిపారు. మరో వారంలో మొత్తం కుళ్లిపోతాయని తెలిపారు.

    దీంతో మృతదేహాలు భద్ర పరిచేందుకు వేరే అవకాశం ఏదైనా ఉందా అని కోర్టు సూపరిండెంట్ శ్రావణ్‌ని అడిగింది. దేశంలో ఇతర ఆస్పత్రుల్లో అయినా భద్రపరచడానికి అవకాశం  ఉందా అని అడిగింది. దీనికి ఆయన తనకు తెలియదన్నారు. మరికాసేపట్లో మృతదేహాల అప్పగింత లేదా తరలింపు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది.
    Published by:Sulthana Begum Shaik
    First published: