హోమ్ /వార్తలు /క్రైమ్ /

దిశ నిందితుడి భార్య 13 ఏళ్లకే 6నెలల గర్భవతి

దిశ నిందితుడి భార్య 13 ఏళ్లకే 6నెలల గర్భవతి

దిశ నిందితులు

దిశ నిందితులు

తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. ఏ4ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది.

దిశ హత్యాచార నిందితుల్లో ఒకరి భార్య మైనర్ అని తేలింది. నిందితుడు చెన్నకేశవులు భార్య వయసు 13 ఏళ్లని అధికారులు జరిపిన విచారణలో తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. అయితే ఆమె వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా గుర్తించారు. ఆమె పుట్టింది 15-06-2006గా ఉంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా. దీంతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధకారులు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు వారు నిరాకరించారు.

తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. ఏ4ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారులు ఏ4 తల్లిదండ్రులకు చెప్పారు. అయితే, వారు అందుకు అంగీకరించలేదు. ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు తమ బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అధికారులు అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు.

First published:

Tags: Disha accused Encounter, Disha murder case, Shadnagar encounter, Shadnagar rape, Telangana

ఉత్తమ కథలు