నువ్వెంత పిసినారివి రా బాబు... ఇంట్లో ఏం దొరక్కపోవడంతో దొంగ ఆవేదన

ఇంటి కిటికీ తొలగించి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బీరువాలు...అన్ని తెరిచి ఏదైనా డబ్బు దొరుకుతుందోనని ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.

news18-telugu
Updated: December 7, 2019, 8:47 AM IST
నువ్వెంత పిసినారివి రా బాబు... ఇంట్లో ఏం దొరక్కపోవడంతో దొంగ ఆవేదన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ ఆవేదన ఇది. అవును వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఇది నిజమే. మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగకు ఏం దొరకపోవడంతో... అతడు ఆవేదనతో ఆ ఇంటి యజమానికి లేఖ రాసి వెళ్లిపోయాడు. పోలీసులు వివరాల ప్రకారం... పర్వేష్ సోని అనే ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఆదర్శ్ నగీన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అతను ఇంటికి సమీపంలోనే జడ్జీ, జాయింట్ కలెక్టర్ కూడా నివాసం ఉంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలో ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న కారణంగా ఆయన ఆ సమయంలో ఇంట్లో లేరు.. అయితే సోని ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఓ దొంగ ఆ ఇంటికి కన్నం వేసే ప్రయత్నం చేశాడు.

ఇంటి కిటికీ తొలగించి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బీరువాలు...అన్ని తెరిచి ఏదైనా డబ్బు దొరుకుతుందోనని ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నం విఫలమైంది. ఆ ఇంట్లో అతడికి చిల్లి గవ్వ కూడా దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దొంగ యజమానికి ఓ చిన్న మెసేజ్ రాసి పెట్టాడు. ‘నువ్వెంత పిసినారివి...కిటికీ పగలగొట్టేందుకు కూడా ఫలితం దక్కలేదు.. ఈ రాత్రంతా నా కష్టం వృథా అయ్యింది’ అంటూ ఇంటి యజమానికి సంబంధించిన డైరీలోనే రాసిపెట్టాడు. ఆ తర్వాత తెల్లవారుజామున పనివాళ్లు.. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పర్వేష్ సోనికి సమాచారం అందించారు. దీంతో సోని.. తన డైరీలో దొంగ రాసిన నోట్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 7, 2019, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading