మృగాళ్ల చేతిలో నలిగిపోయిన మూగ బాలిక.. ఆమె కళ్ల నుంచి కారే కన్నీళ్లను చూసి కూడా చలించలేదు.. దారుణంగా

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : iStock)

Crime News: మనవ మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ మూగ, చెవిటి బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. తర్వాత ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

 • Share this:
  మధ్యప్రదేశ్‌(Madhyapradesh) షాదోల్‌ కొత్వాలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూగ, చెవుడుతో బాధపడుతోంది. దీంతో ఆ బాలిక(Minor Girl)ను ఆమె తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపుడుకుంటూ వస్తున్నారు. ఆ అమ్మాయి మీద కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉంటున్న కొంతమంది కామాంధుల కళ్లు పడ్డాయి. ఎలాగైనా ఆ దివ్యాంగురాలిని అనుభవించాలని అనుకున్నారు. అలాంటి రోజుకోసం ఎదురు చూశారు. ఇలా ఓ రోజు ఆమె ఇంట్లో తల్లిదండ్రులు లేనిది చూశారు. వాళ్లు ఆమె ఇంట్లోకి వెళ్లకుండా ఓ మైనర్ బాలుడిని పంపించారు. ఆ బాలుడికి మాయమాటలు చెప్పి.. ఎలాగైనా బయటకు పిలుచుకురావాలని ఆ బాలుడిని వాళ్ల ఇంటి వద్దకు పంపించారు.

  Father And Daughter: ఇంత దారుణమా.. కన్న తల్లిదండ్రులే ఇలా చేస్తే.. ఆ బాలిక ఇంకెవరికి చెప్పుకోవాలి..


  మైనర్ అబ్బాయి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా మాట్లాడుకుంటూ ఊరు బయట ఉన్న ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారమే ఆ బాలుడిని పంపించిన వాళ్లు అతడితో పాటు అక్కడ మరో ఐదుగురు ఉన్నారు. మొత్తం ఆరుగురు కలిసి ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. వాళ్లు ఆ పని చేస్తున్న క్రమంలో ఆమె మూగ కాబట్టి.. ఎలాంటి కేకలు వేయలేకపోయింది. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి.. తప్ప నోటి నుంచి మాట రాలేదు.. ఆమె మూగ వేదనకు వారు ఏమాత్రం కరుణించలేదు.

  కన్న కూతురుపై అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు.. ఏం చేసిందంటే..


  ఎలాంటి జాలి, దయ లేకుండా ఒకరి తర్వాత ఒకరు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఇంటివద్ద వదిలేశారు. ఇలా చేసిన వారిలో నలుగురు మైనర్లు, ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిసింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆ సమయంలో వీడియో, ఫోటోలు తీసి వాటిని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక ఇంట్లో చెప్పుకోలేపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వెలుగుచూడటంతో విషయం తండ్రికి తెలిసింది. తర్వాత ఆమె ఏం జరిగిందని కుటుంబసభ్యులు గట్టిగా అడగడంతో జరిగిన దారుణాన్ని వాళ్లకు సైగలతో చెప్పుకుంటూ బోరున విలపించింది.

  Love Story: రెండేళ్లు ప్రేమించుకున్నారు.. ప్రియుడు చెప్పిన ఆ ఒక్క మాటకు.. ఆమె ఎంత పని చేసిందో తెలుసా..


  అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్థానిక జిల్లా ఎస్పీ అవధేష్ గోస్వామి మీడియాకు చెప్పారు. గ్యాంగ్ రేప్ వీడియోలు, ఫోటోల ఆధారంగా బాధితురాలు నిందితులను గుర్తు పట్టిందని ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అందులో నలుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే అమ్మాయి నుండి స్టేట్‌మెంట్ పొందడానికి సామాజిక న్యాయ విభాగం నిపుణులను ఆశ్రయించామని చెప్పాడు. ఈ దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో వైరల్ గా మారింది. అంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ కామాంధులను ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: