షాద్‌నగర్ సమీపంలో హత్యాచారానికి గురైన 'దిశ' కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది.చర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితుల్లో ఒకరైన ఆరిఫ్ కింది స్థాయి సిబ్బందితో ఆ విషయం వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దిశను హత్య చేసిన తర్వాతే పెట్రోల్‌తో దహనం చేసినట్టు ఇప్పటివరకు ప్రచారంలో ఉంది. అయితే ఆమె ప్రాణంతో ఉండగానే దహనం చేసినట్టు ఆరిఫ్ వారితో వెల్లడించినట్టు సమాచారం.ఆరోజు సాయంత్రం దిశ కాళ్లు,చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తుండగా ఆమె గట్టిగా కేకలు పెట్టింది.దీంతో చెన్నకేశవులు ఆమె నోట్లో మద్యం పోయగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి లారీలోకి ఎక్కించారు. అక్కడ మరోసారి ఆమెపై అత్యాచారం జరిపారు. మద్యం,అత్యాచారం.. రెండింటి ప్రభావంతో దిశ అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. దీంతో ఆమె చనిపోయినట్టుగా భావించి చటాన్‌పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి బతికి ఉండగానే దహనం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.