జపాన్(Japan) అసలే అభివృద్ధి చెందిన దేశం. రెండో ప్రపంచ యుద్దంలో అతలాకుతలమైనా స్వశక్తితో ఎదిగి ప్రపంచంలో దానికంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. టెక్నాలజీ పరంగానూ బాగా వృద్ధిలో ఉంది. అక్కడ తయారైన వస్తువులే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉంటున్నాయి. జపాన్లో వాషింగ్ మెషీన్లు(washing machines) లేని ఇల్లు ఉండదంటే నమ్మండి. అక్కడ ప్రతీ ఇంటిలోనూ ఒకటి ఉంటుంది. అంతేకాదు అక్కడ వీధుల్లోనూ కాయిన్ లాండ్రీ(Coin laundry)లు ఉంటాయి. చాలామంది తమ బట్టలు లాండ్రీలో వేసుకుని డబ్బులు ఇవ్వకుండా కూడా వెళ్లిపోతారు. అయితే జపాన్(Japan)లో ఓ దొంగ. ఫాంటీ దొంగ(panty thief). చేసిన పని దేశంలో చర్చనీయాంశమైంది. ఏకంగా దొంగతనమే(theft) చేశాడు. ఏం దొంగతనానికే అంత పెద్ద చర్చ ఏంటి అంటారా? అసలు అతను దొంగతనం చేసింది ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అవేంటో తెలుసుకుందాం..
జపాన్లోని బెప్పు (Beppu) నగరంలో ఆ ఫాంటీ దొంగ మాత్రం లాండ్రీ(laundry)లో వేసిన అండర్వేర్ల(Underwear)ను దొంగతనం చేస్తున్నాడట. అయ్యో పాపం కనీసం అండర్వేర్లు కూడా కొనలేని స్థితిలో ఉన్నాడు అనుకోకండి. అతని వృత్తే మహిళల లో దుస్తులను(Inner wears) కొట్టేయడం అంట. ఇంతకీ అతని పేరు ఏంటంటే.. టెట్సువో ఉరతా (Tetsuo Urata). వయస్సు 56 ఏళ్లు. అయితే అతను దొంగతనం చేసిన ముష్టి అండర్వేర్లకే అంత పెద్ద చర్చ ఎందుకు అనుకోకండి. అతను కొట్టేసిన మహిళల అండర్వేర్ల సంఖ్య ఏకంగా 730. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడిందట. అన్నీ కూడా వాడేసిన లో దుస్తులే(Used Underwear’s) కావడం విశేషం.
ఇంతకీ ఆ అండర్వేర్ దొంగ(Underwear thief) ఎలా దొరికాడంటే. ఓ 21 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆరు జతల లో దుస్తులు( 6 pairs of Inner wears) ఇటీవల మిస్ అయ్యాయంటా. లాండ్రీలో వేసిన లో దుస్తులు కనిపించకపోవడంతో ఏకంగా పోలీసులకే ఫిర్యాదు(Complaint) చేసింది ఆమె. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(police) సీసీ టీవీ కెమెరా(CCTV Camera) ఫుటేజీని పరిశీలించి దొంగ టెట్సువో ఉరతా (Tetsuo Urata) అని తేల్చారు. ఇంకేముంది వెంటనే వెళ్లి ఆగస్టు 24న అతని ఇంటిపై దాడి చేశారు పోలీసులు. అయితే ఏదో ఒకటి, రెండు లో దుస్తులు దొరుకుతాయనుకుంటే ఏకంగా 730 వాడేసిన అండర్వేర్లు దొరకడంతో పోలీసులు అవాక్కయ్యారంట.
Read This : ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఇక ఇంటిల్లిపాదికి రోగాలు దరిచేరవు.. ఆ మొక్క ఏంటంటే?
అయితే పోలీసులు మాత్రం అతన్ని పలు కోణాల్లో విచారిస్తున్నారంట. అసలు ఇలాంటి దొంగతనాలు చేయడం ఏంటని పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులు మాట్లాడుతూ.. ఏళ్లుగా ఈ ఉరతా ఇదే పనిచేస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ అతను అలా వాడేసిన వస్తువులు(Used things) దొంగతనం ఎందుకు చేశాడో తెలియదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఓ మహిళ సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
このニュースを見て久しぶりに思い出しました。大学受験のために泊まっていたホテルのコインランドリーで下着を盗まれたことを。あれはほんとうにショックでした…。
下着泥棒 自宅から女性用下着700点以上が押収 56歳男逮捕 大分(フジテレビ系(FNN))#Yahooニュースhttps://t.co/KHOCqA31fj
— 女優55 (@oscar_ymx55) September 4, 2021
అందరూ ఫన్నీ ఫన్నీగా కామెంట్లు(comments) పెట్టారు. ఒకరైతే జాగ్రత్త .. ఇకపై లాండ్రీల వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టబోతున్నాం. మీరు దొంగతనం చేయడం కష్టం అని చమత్కరించారు. మరొక నెటిజన్(netizen) అయితే ఈ సంఖ్య మీకు చాలా పెద్దది కానీ అతనికి ఇంకా కొన్ని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. అతను వాటన్నింటితో ఏం చేస్తున్నాడు? అతను జైలులో దాని గురించి ఆలోచిస్తాడని నేను ఆశిస్తున్నానని మరొకరు రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: సముద్రం మధ్యలో ఉండగా మనిషి మీది కొచ్చిన పెద్ద పాము.. వచ్చి ఆ పాము ఏం చేసిందో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.