వజ్రాల వ్యాపారికి టోపి...డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరింపులు...

ఇద్దరికీ గతంలో నుంచే వ్యాపార బంధం ఉన్న నేపథ్యంలో మదన్ సిసోడియా నిందితుడు వికాస్ వద్ద డబ్బులు తీసుకోకుండానే వజ్రాలు ఇచ్చేశాడు. అంతే కాదు వజ్రాలు అమ్మినట్లు బిల్లు కూడా ఇచ్చేశాడు. అయితే బిల్లు కాపీ అందుకున్న వికాస్ అప్పటి నుంచ ముఖం చాటేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇమ్మని అడిగితే మాట దాటవేస్తూ వస్తున్నాడు.

news18-telugu
Updated: August 9, 2019, 11:44 AM IST
వజ్రాల వ్యాపారికి టోపి...డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరింపులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వజ్రాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వమని షాపు యజమాని అడిగితే, అతడిని చంపేస్తానని బెదిరించి గత రెండేళ్లుగా వేధిస్తున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన వికాస్ చోప్రా అనే వ్యాపారి 2017 జూన్ మాసంలో సోమాజీగుడాలోని మదన్ సిసోడియా అనే వజ్రాల విక్రేత నుంచి రూ. 24 లక్షల విలువైన వజ్రాలను కొనుగోలు చేశాడు. ఇద్దరికీ గతంలో నుంచే వ్యాపార బంధం ఉన్న నేపథ్యంలో మదన్ సిసోడియా నిందితుడు వికాస్ వద్ద డబ్బులు తీసుకోకుండానే వజ్రాలు ఇచ్చేశాడు. అంతే కాదు వజ్రాలు అమ్మినట్లు బిల్లు కూడా ఇచ్చేశాడు. అయితే బిల్లు కాపీ అందుకున్న వికాస్ అప్పటి నుంచ ముఖం చాటేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇమ్మని అడిగితే మాట దాటవేస్తూ వస్తున్నాడు.

దీంతో మోసపోయానిని గ్రహించిన మదన్ సిసోడియా, సూరత్ వెళ్లి వికాస్ ను నిలదీయగా అతడిని ఏకంగా చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు చంపేస్తానని పలు బెదిరింపు కాల్స్ చేయడం కూడా ప్రారంభించాడు. అయితే తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన మదన్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తన్నారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు