DHL Boeing 757 Freighter crashed : కోస్టారికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శాన్ జోస్ లోని శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం బోయింగ్ 757-200 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో రెండు ముక్కులుగా విరిగిపోయింది. రన్‌వేపై ల్యాండ్ అయిన ఈ విమానం కాస్త దూరం ప్రయాణించి ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి హఠాత్తుగా రెండుగా చీలింది. దీంతో అక్కడి వాతావరణం కొద్దిసేపు గందరగోళంగా మారింది. ఈ ప్రమాదం కారణంగా సాన్ జోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు.
జర్మన్ లాజిస్టిక్ దిగ్గజం డీచ్‌ఎల్‌కు చెందిన బోయింగ్ 757 కార్గో విమానం గురువారం ఉదయం కోస్టారికాలోని శాన్ జోస్ విమానాశ్రయం నుంచి గ్వాటెమాల నగరానికి బయలుదేరింది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే పైలెట్లు ఎమర్జెనీ ల్యాండింగ్ కోసం ఎయిర్‌పోర్ట్ అనుమతి కోరారు. పైలట్ అనుమతి అడిగిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కులుగా విరిగిపోయింది. విమానం నుండి ముందుగా పొగలు వెలువడ్డాయి. ఆ తరువాత అది ఆగిపోయింది. వెనుక చక్రాల మీదుగా గుండ్రంగా తిరుగుతూ రెండుగా విడిపోయింది. అదే సమయంలో రన్‌వే నుండి పక్కకు జారిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.
#BREAKING #NEWS | A DHL Boeing 757 Freighter has crashed at Juan Santamaria Airport in Costa Rica earlier today.
— AviationSource (@AvSourceNews) April 7, 2022
Read more at AviationSource!https://t.co/WISE3PjcHS#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/dIECOqQkee
హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. పైలెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారిని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ టెస్ట్ ల కోసం హాస్పిటల్ కు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించామని చెప్పారు. ఈ విమానం రన్ వేపై క్రాష్ అవడంతో దాదాపు 8500 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఉండిపోయారు. దాదాపు 57 వాణిజ్య విమానాల రాకపోకలకు బ్రేక్ పడింది. దాదాపు ఐదు గంటల పాటు ఎయిర్‌పోర్టు తాత్కాలికంగా మూసివేయబడింది. ఆ తర్వాత తెరుచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.