హోమ్ /వార్తలు /క్రైమ్ /

హోటల్‌లో రూమ్ నెంబర్ 405.. గదిలో కనిపించిన సీన్‌ చూసి షాక్ తిన్న పోలీసులు.. వైరల్‌గా మారిన ఆడియో.. అసలేం జరిగింది..?

హోటల్‌లో రూమ్ నెంబర్ 405.. గదిలో కనిపించిన సీన్‌ చూసి షాక్ తిన్న పోలీసులు.. వైరల్‌గా మారిన ఆడియో.. అసలేం జరిగింది..?

ప్రైవేట్ హోటల్ గదిలో ఇరువురి ఆత్మహత్య

ప్రైవేట్ హోటల్ గదిలో ఇరువురి ఆత్మహత్య

కొద్ది రోజుల క్రితం బంధువులు.. రాజీవ్ కుమార్, కాజల్ ఇద్దరిని అభ్యంతర స్థితిలో చూసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది.

హోటల్ రూమ్‌లో ఓ మహిళ, ఓ పురుషుడు ఆత్మహత్య చేసుకున్నారు. విషం తాగి వారిద్దరు చనిపోయారు. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో చోటుచేసుకుంది. అయితే వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని.. వారు ఇళ్ల నుంచి పారిపోయి ధర్మశాల చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత వీరి మరణానికి అసలైన కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న మహిళకు సంబంధించిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాకుండా పోలీసులు ఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఉన్నా జిల్లాలోని పంజోవా ప్రాంతం రాజీవ్‌ కుమార్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా టీచర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక కుమార్తె కేవలం 15 రోజుల క్రితమే జన్మించింది. మరోవైపు అదే ప్రాంతానికి కాజల్‌కు కూడా భర్త పిల్లలు ఉన్నారు. కాజల్ పెళ్లి జరిగిన తర్వాత.. ఆమెకు రాజీవ్ కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. కాజల్ భర్త పని మీద ఎక్కువ రోజులు బయటి ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చేంది. కాజల్, రాజీవ్ కుమార్ సమీప ఇళ్లలో నివసించే వారు. భర్త ఇంట్లో లేని సమయంలో రాజీవ్ కుమార్‌తో కాజల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తోంది.

అయితే కొద్ది రోజుల క్రితం బంధువులు.. రాజీవ్ కుమార్, కాజల్ ఇద్దరిని అభ్యంతర స్థితిలో చూసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇరువురి ఇళ్లలో పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రాజీవ్ కుమార్, కాజల్.. ఇళ్ల నుంచి పారిపోయి ధర్మశాలకు వచ్చాడు. ఇక్కడే ఓ ప్రైవేటు హోటల్‌లో రూమ్ నెంబర్ 405లో ఉంటున్నారు. అయితే బుధవారం మధ్యహ్నం తర్వాత హోటల్ సిబ్బంది వారి రూమ్‌కు ఫోన్ చేస్తే.. ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అనుమానంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గది తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అక్కడ మృతదేహాలను గుర్తించారు. వారి వివరాలు తెలుసుకుని.. బంధవులకు సమాచారం అందజేశారు.

వారి కుటుంబాలను దర్మశాలకు రప్పించిన అనంతరం.. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఇక, పోలీసులు ఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక అనంతరం వారి మృతికి కారణాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

వైరల్‌గా మారిన ఆడియో..

అయితే ఈ ఘటన తర్వాత మృతిచెందిన మహిళదిగా చెబుతున్న ఆడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మహిళ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇద్దరి మధ్య కొన్ని విషయాల గురించి ప్రస్తావన వచ్చింది. అయితే ఆడియోలో మహిళ ఏడుస్తూనే అవతలి వ్యక్తితో మాట్లాడసాగింది. అయితే ఆడియో ఆ మహిళదేనని నిర్ధారణ లేదు. మరోవైపు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. సూసైడ్ నోట్ ఆధారంగా కూడా దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

First published:

Tags: Crime news, Himachal Pradesh, Suicide

ఉత్తమ కథలు