హోమ్ /వార్తలు /క్రైమ్ /

రూ.4 కోసం గొడవ.. వీరు ఇవ్వలేదు.. ఆయన తగ్గలేదు.. అంతే గొంతుకోసి చంపేశారు..

రూ.4 కోసం గొడవ.. వీరు ఇవ్వలేదు.. ఆయన తగ్గలేదు.. అంతే గొంతుకోసి చంపేశారు..

మార్చి 12న రాత్రి మళ్లీ ముగ్గురు మిత్రులు దాబా వద్దకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో దాబాలో గంగ్వార్ ఒక్కడే ఉన్నాడు. ఇదే మంచి సమయమని భావించి.. ముగ్గురూ కలిసి అతడిపై దాడి చేశారు. కత్తితో గొంతుకోసి హత్య చేశారు.

  ఈ సమాజంలో నిత్యం ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతాయి. ముఖ్యంగా హత్య ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప హత్యలు జరగవు. కానీ ఒక్కోసారి చిన్న చిన్న కారణాలకే నేరాలు జరుగుతున్నాయి. తిట్టారని.. ఎదురు చెప్పారని.. వంటి చిన్నా కారణాలతో పలువురు హత్యలు చేస్తున్నారు. క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రూ.4 కోసం గొడవ జరిగి.. ఓ నిండు ప్రాణం బలయింది. రూ.4 తక్కువ ఇచ్చారని అతడు గొడవపెట్టుకున్నాడు. అంతే.. ఆ గొడవ పెద్దయింది. ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లింది. చివరకు ఒకరు హత్యకు గురయ్యారు. బరేలీలోని ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  జీతం డబ్బులు లాక్కొని పుట్టింటికి పంపిస్తోంది.. భార్య వేధింపులు భరించలేక భర్త సూసైడ్

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మార్చి 11న రాత్రి మునావర్ అలియాస్ నంకు అనే వ్యక్తి తన స్నేహితులు మోజిమ్ ఖాన్, మున్నాతో కలిసి ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి రెండు కప్పుల టీ తాగారు. బిల్లు ఎంతయింది? అని అడిగితే.. రూ.20 అని దాబా యజమాని సేవారామ్ గంగ్వార్ సమాధానం ఇచ్చాడు. రెండు టీలకు రూ.16 మాత్రమే అవుతాయని.. అంతే ఇస్తామని ఆ ముగ్గురు మిత్రులు చెప్పారు. కానీ సేవారామ్ గంగ్వార్ వినలేదు. రేట్లు పెరిగాయని.. ఒక్క రూపాయి తగ్గినా ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు. మొత్తం 20 రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టాడు. డబ్బులు లేనప్పుడు టీ ఎందుకు తాగారని ప్రశ్నించాడు. చివరకు మున్నా తన జేబులో ఉన్న 100 నోటు తీసి డబ్బులు చెల్లించాడు. ఐతే రూ.4 కోసం.. ఇంత రచ్చ చేస్తాడా? అని గంగ్వార్‌పై ఆ ముగ్గురు స్నేహితులు కక్ష పెంచుకున్నారు. అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్లాన్ రెడీ చేసి అమలు చేశారు.

  మంచపై శవం.. కత్తితో పొడిచి హత్య.. ఇంట్లోకి ఎవరూ రాలేదు.. మరి ఎవరు చంపారు?

  మార్చి 12న రాత్రి మళ్లీ ముగ్గురు మిత్రులు దాబా వద్దకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో దాబాలో గంగ్వార్ ఒక్కడే ఉన్నాడు. ఇదే మంచి సమయమని భావించి.. ముగ్గురూ కలిసి అతడిపై దాడి చేశారు. కత్తితో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం గంగ్వార్ కుమారుడు దాబాకు వెళ్లాడు. తండ్రి శవాన్ని చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని అడిగితే.. నిన్న ముగ్గురు వ్యక్తులతో బిల్లు విషయమై గొడవ జరిగిందని చెప్పారు. అతడు చెప్పిన వివరాల అధారంగా పోలీసులు రంగంలోకి దిగి మునావర్, మోజిమ్ ఖాన్, మున్నాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ముగ్గురు నేరం అంగీకరించారు.

  First published:

  Tags: Crime news, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు