DEPRESSION AFTER BREAKING UP THE ENGAGEMENT PNB WOMEN EMPLOYEE LIFE LEADS TO SAD ENDING SSR
ఈమె ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్.. ఉదయాన్నే పాలు పోసే వ్యక్తి ఆమె రెంట్‌కు ఉంటున్న రూంకు వచ్చేసరికి..
శ్రద్ధా గుప్తా
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులు కారణమని ఆ మహిళ సూసైడ్ నోట్లో పేర్కొంది.
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులు కారణమని ఆ మహిళ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోలోని రాజాజీపురానికి చెందిన శ్రద్ధా గుప్తా(32) అనే మహిళ ఖవాస్పురలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్రాంచ్‌లో 2015లో క్లర్క్‌గా చేరింది.
ఆ తర్వాత ప్రమోషన్ సాధించి సుల్తాన్‌పూర్‌లోని మెయిన్ బ్రాంచ్‌కు అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించింది. బ్యాంకుకు దగ్గరలో ఓ గది అద్దెకు తీసుకుంది. ఆ గదిలో మొదటి నుంచి శ్రద్ధా ఒక్కతే ఉండేది. శనివారం ఉదయం పాలు పోసే వ్యక్తి శ్రద్ధా గది వద్దకు వెళ్లి డోర్ కొట్టాడు. ఎంతసేపటికీ ఆమె డోర్ తీయకపోవడంతో అనుమానమొచ్చి కిటికీలో నుంచి లోపలికి చూశాడు. శ్రద్ధా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. దీంతో.. ఒక్కసారిగా భయంతో వణికిపోయిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆమె తల్లిదండ్రులను ఉద్దేశించి ఆ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు రాజేష్, వివేక్ గుప్తా, అనిల్ రావత్ (ఫైజాబాద్ పోలీస్), ఆశిష్ తివారి (ఎస్ఎస్ఎఫ్ హెడ్ లక్నో) కారణమని శ్రద్ధా అందులో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. శ్రద్ధా కొన్ని రోజుల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. రాజేష్ గుప్తా అనే యువకుడితో శ్రద్ధాకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ.. ఇరు కుటుంబాల మధ్య కొన్ని గొడవలు తలెత్తడంతో ఈ పెళ్లి జరగలేదు. ఈ పరిణామంతో శ్రద్ధా తీవ్ర మనస్తాపానికి లోనైంది. అయితే.. ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్న పేర్లను గురించి పోలీసులు విచారించగా.. జిల్లాలో ఆమె పేర్కొన్న పేరుతో పోలీసు లేడని తేలింది. శ్రద్ధా కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అయితే.. ఆమె ఫోన్‌కు లాక్ పెట్టుకోవడం, ఆ లాక్ ఓపెన్ కాకపోవడంతో పోలీసులు ఆ లాక్‌ను ఓపెన్ చేయించే పనిలో ఉన్నారు. ఆమె కాల్‌డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు శ్రద్ధా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంచి ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉంటోందని భావించిన కన్న కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తుందని అనుకోలేదని శ్రద్ధా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.