DEPRESSED YOUNG MAN FROM HUZURNAGAR COMMITS SUICIDE IN KHAMMAM LODGE SSR
Khammam: ఆ యువకుడి వయసు 29 ఏళ్లు.. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదని.. ఖమ్మం లాడ్జిలో రూం తీసుకుని..
ప్రతీకాత్మక చిత్రం
కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదని అంటుంటారు. కానీ కొందరు మాత్రం పెళ్లి (Marriage) విషయంలో అనుకున్న సమయంలో సంబంధం కుదరలేదని మదనపడుతుంటారు. తీవ్ర మనస్తాపం చెందుతుంటారు. తన తోటి వారందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయని.. తనకు మాత్రం ఏ సంబంధం కుదరడం లేదని కుమిలిపోతుంటారు.
హుజూర్నగర్: కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదని అంటుంటారు. కానీ కొందరు మాత్రం పెళ్లి (Marriage) విషయంలో అనుకున్న సమయంలో సంబంధం కుదరలేదని మదనపడుతుంటారు. తీవ్ర మనస్తాపం చెందుతుంటారు. తన తోటి వారందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయని.. తనకు మాత్రం ఏ సంబంధం కుదరడం లేదని కుమిలిపోతుంటారు. పెళ్లి కావడం లేదన్న బెంగలో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. హుజూర్‌నగర్‌లో తాజాగా అదే జరిగింది. 29 ఏళ్ల వయసొచ్చినా తనకు పెళ్లి సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుజూర్‌నగర్‌లోని సీతారాంనగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌కు చెందిన పోల నరేష్‌కు గత కొన్ని నెలలుగా ఇంట్లో పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే.. కారణం ఏంటో తెలియదు గానీ.. ఏ సంబంధం కూడా కుదరలేదు. ఇక.. తనకు జీవితంలో పెళ్లి యోగం లేదని సన్నిహితుల వద్ద, స్నేహితులతో చెప్పుకుని నరేష్ బాధపడుతుండేవాడు.
అలా ఏం జరగదని.. కాస్త ఆలస్యమైనా మంచి సంబంధం కుదురుతుందని మిత్రులు ధైర్యం చెప్పేవారు. అయినప్పటికీ ఆశలు వదిలేసుకున్న నరేష్ కొన్ని రోజుల నుంచి పెళ్లి విషయంలో బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఆగస్ట్ 26న మట్టపల్లికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. అయితే.. మట్టపల్లికి వెళ్లకుండా నేరుగా ఖమ్మం (Khammam) వెళ్లి అక్కడ శ్రీనివాస లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గదిలోకి వెళ్లి ఇంట్లో వాళ్లకు ఫోన్ చేశాడు. తనకు బతకాలని లేదని.. తనకు ఇక ఎన్నటికీ పెళ్లి కాదని చెప్పుకుని బాధపడ్డాడు. ఎక్కడున్నావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. ఖమ్మంలో లాడ్జిలో ఉన్నానని.. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నరేష్ కుటుంబం హుటాహుటిన అక్కడికి చేరుకుంది.
అయితే.. అప్పటికే నరేష్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. చికిత్స పొందుతూ.. నరేష్ ప్రాణాలు కోల్పోయాడు. నరేష్ సోదరుడు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబపరంగా నరేష్‌కు ఎలాంటి సమస్యలు లేవని, పెళ్లి సంబంధం కుదరలేదన్న దిగులుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.