Home /News /crime /

DEPRESSED HUSBAND WROTE A SUICIDE NOTE AND ATTEMPT SUICIDE IN VISAKHAPATNAM SSR

Visakhapatnam: ‘లలిత.. నువ్వు నా దేవత.. మరో పెళ్లి చేసుకో’ అని సూసైడ్‌ నోట్ రాసి..

అరుణ్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

అరుణ్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

అరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో అరుణ్ సోదరుడితో కలిసి పెందుర్తిలో నివాసం ఉంటున్నాడు. గోపాలపట్నంలోని చికెన్ షాప్‌లో పని చేస్తున్నాడు. భార్య మాడుగుల గ్రామంలో ఉంటుంది.

    విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నంలో చేతి మణికట్టు కోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద అరుణ్ అనే యువకుడు చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యా యత్నానికి కారణంగా తెలిసింది. అరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో అరుణ్ సోదరుడితో కలిసి పెందుర్తిలో నివాసం ఉంటున్నాడు. గోపాలపట్నంలోని చికెన్ షాప్‌లో పని చేస్తున్నాడు. భార్య మాడుగుల గ్రామంలో ఉంటుంది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన అరుణ్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే ఆత్మహత్యకు యత్నించాడు. 108 వాహనంలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అరుణ్‌ను కేజీహెచ్‌కు తరలించారు.

    సూసైడ్ నోట్‌లో భార్య లలితను వేరొక పెళ్లి చేసుకోమని, బాబుని బాగా చూసుకోమని అరుణ్ రాయడం గమనార్హం. ‘లలిత.. నీకు అన్యాయం చేశాను.. మళ్లీ జన్మంటూ ఉంటే నీవే నా భార్య కావాలని కోరుకుంటాను’ అంటూ అరుణ్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తాను చనిపోతున్నానని, తనను క్షమించాలని కోరాడు. ఇదిలా ఉంటే.. అరుణ్ గురించి ఆరా తీసేందుకు పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా.. ఈలోపే అరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సూసైడ్ నోట్‌లో భార్యపై తనకున్న ప్రేమను చాటుకునేలా అరుణ్ కొన్ని వాక్యాలు రాశాడు.

    ఇది కూడా చదవండి: Lover: ‘నన్ను వాడుకుని.. ఈమెతో పెళ్లా’.. మోనపోరాటాలు దండగనుకుని మోత మోగించిన లవర్..!

    ‘నువ్వు నా దేవత.. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం.. కానీ ఏరోజూ నిన్ను సరిగా చూసుకోలేదు.. నన్ను క్షమించు.. నేను చనిపోయిన తర్వాత నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలి.. బాబును బాగా పెంచాలి.. నువ్వు ఆనందంగా ఉండాలి’ అని వేపగుంటకు చెందిన అరుణ్ తన భార్య ‌ను ఉద్దేశించి సూసైడ్ నోట్‌లో రాశాడు. అయితే.. అరుణ్ మద్యం మత్తులో ఇలా ఆత్మహత్యకు యత్నించాడా లేక భార్య దూరమై మానసిక ఒత్తిడిలో ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: AP News, Attempt to suicide, Crime news, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు