చిన్న చెల్లి చేసిన పనికి.. ఆత్మహత్యకు యత్నించిన నలుగురు అక్కాచెల్లెళ్లు

చిన్నమ్మాయి, తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: June 28, 2019, 8:36 AM IST
చిన్న చెల్లి చేసిన పనికి.. ఆత్మహత్యకు యత్నించిన నలుగురు అక్కాచెల్లెళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.చిన్న చెల్లి ఓ అబ్బాయితో కలిసి ఇంటి నుంచి పారిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెల్లి చేసిన పనికి కుటుంబ పరువు పోయిందని కుమిలిపోయి ఆత్మహత్యకు యత్నించారు.

వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. ఆరుగురిలో అయిదో అమ్మాయి బుధవారం నుంచి కనిపించడం లేదు. దీంతో సోదరి కోసం అన్నిచోట్లా వెతికారు. తనకేమై ఉంటుందని తీవ్రంగా కలత చెందారు. అయితే ఓ అబ్బాయితో కలిసి ఆమె పారిపోయినట్టు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ పరువు తీసిందని ఆవేదన చెందారు. విషయం తెలిసిన వెంటనే నలుగురు అక్కాచెల్లెళ్లు గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నారు. అంతకుముందుఅందరిలో చిన్నదైన ఆరో అమ్మాయిని, తల్లిని గదిలో పెట్టి గడియ పెట్టారు.

నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చిన్నమ్మాయి, తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. నలుగురిలో ఒకరి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>