సరికొత్త మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ... ఇక ఎవరూ తప్పించుకోలేరు...

Mobile Tracking : ఇన్నాళ్లూ పోలీసుల నుంచీ తప్పించుకు తిరిగేందుకు అక్రమార్కులు... తమ సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఇకపై అలా చేసినా వాళ్లు దొరికిపోవడం గ్యారెంటీ.

Krishna Kumar N | news18india
Updated: July 10, 2019, 10:12 AM IST
సరికొత్త మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ... ఇక ఎవరూ తప్పించుకోలేరు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీకు తెలిసే ఉంటుంది. మన మొబైల్‌లో సిమ్ ఉంటే చాలు... మనం ఎక్కడున్నదీ పోలీసులు కనిపెట్టగలరు. తెలివైన వాళ్లు... మొబైల్ నుంచీ సిమ్ తీసేస్తున్నారు. అలా చేస్తే మాత్రం మనం ఎక్కడున్నదీ పోలీసులు కనిపెట్టలేరు. ఐతే... ఇప్పుడో కొత్త టెక్నాలజీ వస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ పేరు మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్. దీని ద్వారా సిమ్ తీసేసినా, మొబైల్‌కి ఉండే IMEI నంబర్ మార్చేసినా కూడా మనల్ని పోలీసులు ఎక్కడున్నదీ ఇట్టే కనిపెట్టగలరు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఆగస్ట్‌లో దీన్ని ప్రారంభించబోతోంది.

ఇన్నాళ్లూ దొంగలు మొబైళ్లను ఎత్తుకుపోయి సిమ్ తీసేసి, మరెవరికో అమ్మేస్తున్నారు. అలాగే నేరాలు చేసినవాళ్లు మొబైళ్లను స్విచ్ఛాఫ్ చేసి... తప్పించుకు తిరుగుతున్నారు. కోట్లకు కోట్లు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని... అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. అలాంటి కేటుగాళ్లందర్నీ పట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.

ఇదెలా సాధ్యం? : ఎవరైనా మొబైల్ ఎత్తుకుపోతే, IMEI మార్చితే, CEIR టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. దీన్లో అన్ని మొబైల్ ఆపరేటర్ల IMEI డేటాబేస్‌ ఉంటుంది. మొబైల్ ఆపరేటర్లు ఈ డేటాను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడం మాత్రమే కాదు... ఆ మొబైల్‌కి ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న ఆపరేటర్‌తోపాటూ... మరే ఆపరేటరూ... సేవలు అందించకుండా చెయ్యవచ్చు.

కంప్లైంట్స్ కోసం హెల్ప్‌లైన్ : మొబైల్ దొంగతనాల కంప్లైంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ జారీ అయ్యింది. ఎవరైనా సరే, మొబైల్ పోతే, 14422లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. దొంగ దేశంలో ఎక్కడున్నా సరే, ఈజీగా కనిపెడతారు. ఈ వ్యవస్థను మహారాష్ట్రలో మొదట ప్రారంభించారు. అక్కడ పూర్తిగా విజయవంతమైంది. ఆగస్ట్ నుంచీ దేశమంతా అమలు చేస్తామని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

హెల్ప్ లైన్ నంబర్ 14422తో కంప్లైంట్ ఇవ్వగానే... ఆ కంప్లైంట్... మొబైల్ కంపెనీలకు వెళ్తుంది. వెంటనే ఆ మొబైల్‌ను బ్లాక్ చేస్తాయి. ఆ తర్వాత ఆ మొబైల్ దేశంలో ఎక్కడా పనిచెయ్యదు. ఎవరైనా IMEI నంబర్ మార్చితే... మూడేళ్ల జైలు శిక్ష తప్పదు.

 

(రఘు, కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
First published: July 10, 2019, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading