అతను చనిపోయాడా... ఆమె ఆత్మే చంపేసిందా... డెంటిస్ట్ ప్రీతీరెడ్డి హత్యపై భిన్న కథనాలు...

ప్రీతీరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాతి రోజే యాక్సిడెంట్‌లో చనిపోయిన నిందితుడు హర్షవర్థన్... ప్రీతీరెడ్డి ఆత్మే హర్షవర్థన్‌పై ప్రతీకారం తీర్చుకుని ఉంటుందని భావిస్తున్న జనాలు... అతను చనిపోయిన తీరు, యాక్సిడెంట్ జరిగిన విధానం మామూలుగా లేవంటూ వాదన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 7, 2019, 7:05 PM IST
అతను చనిపోయాడా... ఆమె ఆత్మే చంపేసిందా... డెంటిస్ట్ ప్రీతీరెడ్డి హత్యపై భిన్న కథనాలు...
సీసీటీవీలో చివరిసారిగా కనిపించిన ప్రీతిరెడ్డి (Photo: twitter)
  • Share this:
ఆస్ట్రేలియాలో తెలుగు యువతి, తెలంగాణ అమ్మాయి డెంటిస్ట్ ప్రీతీరెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లోని సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతీరెడ్డి... ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు (మార్చి 3) కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతీరెడ్డి... రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అయితే రాత్రి ఎంతసేపటికీ ఆమె రాకపోవడం...ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు... సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా గాలించారు. అయితే ఆ తర్వాత సిడ్నీలోని సౌత్ వేల్స్ ఏరియాలో పార్క్ చేసి ఉనన ఆమె కారులోనే ఓ సూట్‌కేసులో శవమై కనిపించింది ప్రీతిరెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రీతీరెడ్డి హత్య వెలుగులోకి వచ్చిన తర్వాతి రోజే... ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ కూడా రోడ్డు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
preeti Reddy Dentist, Indian-origin Dentist Preeti Reddy murder, Preeti Reddy killed in Australia, Body found in Suitcase, Dentist Preeti Reddy missing Case, Ex-boyfriend of Preeti Reddy, Preeti Reddy murder case in Australia, McDonald's in George Street Australia, Strachan lane in Kingsford, Body found inside the Case, NSW Police, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి,ప్రీతిరెడ్డి హత్య, ఆస్ట్రేలియాలో తెలుగు యువతి డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, ప్రీతిరెడ్డి మర్డర్ న్యూస్, ప్రీతిరెడ్డి బాయ్‌ఫ్రెండ్ హత్య యాక్సిడెంట్, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు
ప్రీతీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు (Photo: twitter)


ప్రీతీరెడ్డి మృతదేహం దొరికిన తర్వాతి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్థన్ నార్డే... రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా చాలామంది ప్రీతీరెడ్డి ఆత్మే హర్షవర్థన్‌పై ప్రతీకారం తీర్చుకుని ఉంటుందని చెబుతున్నారు. చివరి సారిగా కనిపించిన సిడ్నీలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ సమీపంలో ప్రీతీరెడ్డితో పాటు హర్షవర్థన్ ఉన్నట్టు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ... ప్రీతిరెడ్డి తన కారులోనే శవమై కనిపించింది. ఆ తర్వాతి రోజే హర్షవర్థన్‌కు యాక్సిడెంట్ అయి చనిపోయాడు.
preeti Reddy Dentist, Indian-origin Dentist Preeti Reddy murder, Preeti Reddy killed in Australia, Body found in Suitcase, Dentist Preeti Reddy missing Case, Ex-boyfriend of Preeti Reddy, Preeti Reddy murder case in Australia, McDonald's in George Street Australia, Strachan lane in Kingsford, Body found inside the Case, NSW Police, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి,ప్రీతిరెడ్డి హత్య, ఆస్ట్రేలియాలో తెలుగు యువతి డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, ప్రీతిరెడ్డి మర్డర్ న్యూస్, ప్రీతిరెడ్డి బాయ్‌ఫ్రెండ్ హత్య యాక్సిడెంట్, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు
ప్రీతీ రెడ్డి ఫోటో (Photo: Twitter)

సీడ్నిలోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటెల్‌లో ఆదివారం హర్షవర్థన్‌తో కలిసి ప్రీతీరెడ్డి బస చేసిందని... ఆ తర్వాత సెయింట్ లియోనార్డ్స్‌లో జరిగిన కాన్ఫిరెన్స్‌కు అటెండ్ అయ్యిందని.... పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా ఏదో విషయమై గొడవ జరిగి, తీవ్ర ఆవేశానికి లోనైన హర్షవర్థన్ నార్డే కత్తితో దాడి చేసి ప్రీతీరెడ్డి చంపేశాడని తేల్చారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి, తన కారులోనే పెట్టి వెళ్లిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రీతీరెడ్డి మృతదేహాం పోలీసులకు దొరకడంతో దొరికిపోతాననే భయంతో అతివేగంతో కారును నడిపి, యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అయితే అతను చనిపోయిన తీరు, యాక్సిడెంట్ జరిగిన విధానం మామూలుగా లేవని... ప్రీతీరెడ్డి ఆత్మే తనను చంపిన హర్షవర్థన్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు ఉన్నాయా? అనే విషయమై స్పష్టత లేకపోయినా మిస్టరీగా మారిన మర్డర్ కేసులో ఇలాంటి ఊహాగానాలు వినిపించడం కొత్తేమీ కాదు. హేతువాదులు మాత్రం యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్‌లో హంతకుడు చనిపోతే... బాధితురాలి ఆత్మే చంపిందని ఎలా చెబుతారని వాదిస్తున్నారు. ప్రీతీరెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామం.First published: March 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading