Home /News /crime /

DENMARK COPENHAGEN GUN FIRING SEVERAL INJURED IN COPENHAGEN MALL SHOOTING POLICE PAH

ఆగని మారణ హోమం.. షాపింగ్ మాల్ లో కాల్పులు.. ఈసారి ఎక్కడంటే..

అప్రమత్తమైన అధికారులు

అప్రమత్తమైన అధికారులు

Copenhagen: యూరప్ లోని డెన్మార్క్ లో కాల్పుల ఘటన కలకలంగా మారింది. ఒక దుండగుడు షాపింగ్ మాల్ లో ప్రవేశించి కాల్పులు జరిపాడు.

అగ్రరాజ్యం అమెరికాలో (America)  కాల్పుల పర్వం మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు ఎక్కడోక చోట కాల్పుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. పాఠశాలు, షాపింగ్ మాల్స్ లు,సూపర్ మార్కెట్ లను టార్గెట్ గా చేసుకుని దుండగులు దుశ్చర్యలకు దిగుతున్నారు. దీనిలో వందలాది మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే, ఈ కాల్పుల పర్వం యూరప్ కు పాకింది. తాజాగా, ఒక దుండగుడు.. డెన్మార్క్ లోని (denmark)  కోపెన్ హెగెన్ లో(Copenhagen) కాల్పులకు (Gun fire)  దిగాడు. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య ఉన్న అమేగర్ జిల్లాలో ఉన్న మాల్ లో ఆదివారం కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో.. పలువురు ప్రాణాలు కొల్పోయారని సమాచారం. కొంత మంది అక్కడి నుంచి బయటవైపు పరుగులు పెట్టారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంకేవరైనా ఉన్నారా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.

ఇదిలా ఉండగా గతంలోను అమెరికాలో కాల్పులు జరిగాయి.

అమెరికా(America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

స్థానికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gun fire

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు