పాత నోట్లు మార్పిస్తానంటూ... రూ. 60 లక్షలు కాజేసిన లేడీ సింగర్...

యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న హర్యానా సింగర్ శిఖా రాఘవ్... స్టేజ్ షో దగ్గర పరిచయమైన మిలిటరీ అధికారిని రూ. 60 లక్షలకు టోకరా వేసిన సింగర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 4:36 PM IST
పాత నోట్లు మార్పిస్తానంటూ... రూ. 60 లక్షలు కాజేసిన లేడీ సింగర్...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 4:36 PM IST
మోదీ ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేసి... దాదాపు రెండేళ్లు కావస్తోంది. ‘డిమోనిటైజేషన్’ ప్రభావం సాధారణ జనాల మీద ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పాత పెద్ద నోట్లు ఎలా మార్పించాలో తెలియక చాలామంది పెద్దవయసువాళ్లు, నిరక్ష్యరాస్యులు, కొందరు ఛీటర్స్ చేతుల్లో మోసపోయారు. తాజాగా పెద్ద నోట్ల మార్పడి విషయంలో ఓ మాజీ మిలిటరీ అధికారి కూడా మోసపోయాడంటే నమ్మకం కాస్త కష్టమే. ఓ పారా మిలిటరీ ఉద్యోగిని మోసిగించి... దాదాపు రూ. 60 లక్షలు కాజేసింది ఓ సింగర్. హర్యానాలో యూట్యూబ్ వీడియోలతో ఫుల్లు పాపులారటీ సంపాదించుకున్న శిఖా రాఘవ్ అనే 27 ఏళ్ల సింగర్... స్టేజ్ షోలతో కూడా స్థానికంగా పేరు తెచ్చుకుంది. ప్రేమ గీతాలతో పాటు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించే శిఖా రాఘవ్... హర్యానాతో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.

రెండేళ్ల క్రితం ఢిల్లీలో రామ్‌లీలా ప్రాంతంలో ఓ స్టేజ్ షో కార్యక్రమానికి హాజరైంది శిఖా రాఘవ్. అక్కడ ఓ రిటైర్డ్ పారా మిలిటరీ అధికారికి చెందిన ఇంట్లో బస చేసింది. అదే సమయంలో పెద్దనోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ హఠాత్ పరిణామంతో మనోవేదనకు గురైన మిలిటరీ అధికారి... తన దగ్గర దాదాపు రూ.60 లక్షల పాతనోట్లు ఉన్నాయని... వాటిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని సింగర్ శిఖా రాఘవ్ దగ్గర ప్రస్తావించాడు. అతని భయాన్ని ఆసరాగా చేసుకున్న సింగర్... ఆ నోట్లు తాను మార్చి ఇస్తానని చెప్పి నమ్మించింది. రూ.60 లక్షలు తీసుకుని... నోట్లు మార్పిడి చేసిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె దగ్గర్నుంచి ఎన్ని రోజులకూ ఫోన్ రాలేదు. ఆమె నెంబర్‌కు కాల్ చేస్తే... స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దాంతో తాను మోసపోయినట్టు గ్రహించిన మిలిటరీ అధికారి... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దాదాపు రెండేళ్ల పాటు గాలింపు చర్యలు చేపట్టి... సింగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శిఖా రాఘవ్‌తో పాటు ఆమెకు సాయం చేసిన పవన్ అనే వ్యక్తి ఇంకా పరారీలోనే ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి...

ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...
ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు


దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...


థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...

Loading...

మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...