హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. డెలివరీ బాయ్ మృతి

మంగళవారం ఉదయం ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా అతడి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తలకు బలమైన గాయం కావడంతో అతడు చనిపోయాడు.

news18-telugu
Updated: March 10, 2020, 6:26 PM IST
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. డెలివరీ బాయ్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపు తప్పి బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా మియాపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన నూనావత్ మిత్యా, మోతి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సుమన్ నాయక్ (25). తొమ్మిది నెలల క్రితమే లక్ష్మి అనే యువతితో సుమన్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సుమన్.. మియాపూర్‌లో ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా అతడి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తలకు బలమైన గాయం కావడంతో అతడు చనిపోయాడు. సుమన్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: March 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading