మహిళపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం.. హిప్నటైజ్ చేసి..

హిప్నటైజ్ చేసిన తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరని.. అదే అదనుగా తనపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది

news18-telugu
Updated: October 10, 2019, 10:32 PM IST
మహిళపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం.. హిప్నటైజ్ చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డెలివరీ బాయ్ తనపై అత్యాచార యత్నం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిటర్న్ పికప్ కోసం వచ్చిన అతడు హిప్నటైజ్ చేసి తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ శివారులోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 43 ఏళ్ల ఓ మహిళ నోయిడాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల అమెజాన్‌లో ఓ బాక్స్‌ను ఆర్డర్ చేసింది. ఐతే అది నచ్చకపోవడతో రిటర్న్ రిక్వెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రిటర్న్ పికప్ కోసం ఓ డెలివరీ బాయ్ ఆమె ఇంటికి వెళ్లాడు.

వాస్తవానికి ఆ బాక్స్‌లో మరో ఐదు చిన్న బాక్స్‌లు ఉంటాయి. ఐతే తాను కేవలం 4 బాక్స్‌లను తీసుకెళ్లేందుకే అనుమతి ఉందని.. ఐదో బాక్స్‌ను తీసుకెళ్లనని ఆమెతో చెప్పాడు. అన్ని బాక్సులూ తీసుకెళ్లాల్సిందేనని ఆమె వాదించింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో బాధితరాలు చెల్లి వచ్చి కస్టమర్ కేర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేసింది. అతడితో మాట్లాడిన అమెజాన్ ప్రతినిధులు .. అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. 9న మరో డెలివరీ వాయ్ వెళ్లి పికప్ చేసుకుంటాడని వెల్లడించారు. దాంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు సోదరి సైతం పనిమీద బయటకు వెళ్లింది.

ఐతే కాసేపటికి ఆ డెలివరీ బాయ్ బాధితురాలు ఫ్లాట్‌కు తిరిగొచ్చి మొత్తం బాక్సులను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అమెజాన్ వేరొక డెలివరీ బాయ్‌ని కేటాయిచిందని.. అతడికే ఇస్తానని స్పష్టం చేసింది. ఇలా ఆ కొరియర్ బాయ్‌తో మాట్లాడుతున్న క్రమంలోనే ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. కాసేపటికి తనకు స్పృహ వచ్చిందని.. లేచి చూసే సరికి డెలివరీ బాయ్ ప్యాంట్ విప్పి నిల్చున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హిప్నటైజ్ చేసిన తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.

ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరని.. అదే అదనుగా తనపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇంట్లో ఉన్న ఓ కర్రతో దాడిచేసేందుకు యత్నించానని.. దాంతో అతడు పారిపోయాడని వెల్లడించింది. జరిగిన విషయాన్ని తన సోదరికి చెప్పానన్న బాధితురాలు.. అపార్ట్‌మెంట్ రిజిస్టర్‌లో డెలివరీ బాయ్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఆధారంగా అతడి వివరాలను తెలుసుకున్నామని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ఇక, జరిగిన ఘటన పట్ల అమెజాన్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని.. సదరు డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు