Shocking: రాత్రి వేళ ఇంటికి వెళ్తున్న మహిళ.. ఇంటి వద్ద దింపుతానన్న క్యాబ్ డ్రైవర్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

బాధితురాలు.. ఎంజీ రోడ్డులోని ఓ ఫ్యాషన్ బ్రాండ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తుంది. బుధవారం రాత్రి 8.16 గంటలకు ఆమె ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్‌ గేట్ నెంబర్ 2వ వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వెయిట్ చేస్తుంది.

  • Share this:
    పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ ఎక్కిన ఆమెపై.. క్యాబ్‌ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించిన వాహనంలోనే ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు.. ఎంజీ రోడ్డులోని ఓ ఫ్యాషన్ బ్రాండ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తుంది. బుధవారం రాత్రి 8.16 గంటలకు ఆమె ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్‌ గేట్ నెంబర్ 2వ వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వెయిట్ చేస్తుంది. ఆ సమయంలో నిందితుడు మహిళ సమీపంలోకి వచ్చాడు. అయా నగర్ ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ప్రయాణికులను పిలవడం మొదలుపెట్టాడు.

    దీంతో బాధిత మహిళ ఇంటికి వెళ్లడం కోసం ఆ వాహనం వద్దకు వెళ్లింది. ఆమె క్యాబ్ ఎక్కుతుండగా.. ముందు సీట్‌లో కూర్చొవాల్సిందిగా కోరాడు. వెనకాలు ఇతర ప్రయాణికులు ఎక్సాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. వాహనంలోనే అత్యాచారం చేశాడు. తన కోరిక తీర్చకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అయా నగర్ సరిహద్దు వద్ద వదిలేసి నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.

    అనంతరం బాధితురాలి తన భర్తకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని.. ఇంటికి చేరింది. ఆ మరసటి రోజు ఈ ఘటనకు సంబంధించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ డీఎల్‌ఎఫ్ ఫేజ్-2 పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని.. క్యాబ్ డ్రైవర్ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: