హోమ్ /వార్తలు /క్రైమ్ /

మెట్రో స్టేషన్ లో ఆగంతకుడి వికృత చేష్టలు... సింగిల్ గా ఉన్న యువతి దగ్గరకు వచ్చి..

మెట్రో స్టేషన్ లో ఆగంతకుడి వికృత చేష్టలు... సింగిల్ గా ఉన్న యువతి దగ్గరకు వచ్చి..

యువతిని వేధిస్తున్న ఆగంతకుడు

యువతిని వేధిస్తున్న ఆగంతకుడు

Delhi:  యువతి సింగిల్ గా తన ట్రైన్ కోసం వేచి చూస్తోంది. ఇంతలో.. ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. అడ్రస్ చెప్పాలని మాటలు కలిపాడు. ఆ తర్వాత.. మెల్లగా యువతి దగ్గరకు వెళ్లాడు.

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు బరితెగిస్తున్నారు. బడి, గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రతి చోట మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురౌతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. దుర్మార్గులు, పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. చివరకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ కూడా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. కొందరు పోలీసులు స్టేషన్ లోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఇది వరకు వార్తలలో నిలిచాయి. ఇక..మెట్రోస్టేషన్ లో సింగిల్ ఉన్న మహిళను ఒక ఆంతకుడు వేధించాడు.

పూర్తి వివరాలు.. ఢిల్లీ లో (Delhi)  దారుణ ఘటన జరిగింది. జోర్ బాగ్ మెట్రో స్టేషన్ (metra rail station)  పరిధిలో జూన్ 2న ఈ ఉదంతం చోటు చేసుకుంది. యువతి తాజాగా, తన వేధింపుల ఘటనను ట్విటర్ వేదికగా తెలిపింది. జూన్ 2 న యువతి రైలు కోసం వేచిచూస్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు యువతి దగ్గరకు వచ్చాడు.

మెల్లగా మాటలు కలిపాడు. ఆ తర్వాత.. ఆమె ముందు వికృతంగా ప్రవర్తించాడు. అతడి పనిని చూసి యువతి షాక్ కు గురైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన తర్వాత... యువతి తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ తర్వాత.. ఇప్పుడు తాను ఎదుర్కొన్న ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా  జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది.

డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment)  వేధించాడు.

అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై  కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.

First published:

Tags: Crime news, Delhi, Delhi metro, Female harassment

ఉత్తమ కథలు