హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహిళను లోబర్చుకుని.. 8 ఏళ్లలో.. 14 సార్లు అబార్షన్.. చివరకు.. ఏం జరిగిందంటే..

మహిళను లోబర్చుకుని.. 8 ఏళ్లలో.. 14 సార్లు అబార్షన్.. చివరకు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: భర్తతో దూరంగా ఉంటున్న మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెకు ఏది కావాలన్న చేసిపెట్టేవాడు. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో లోంగదీసుకున్నాడు.

కొందరు ప్రేమను తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో... అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. తమ పనులు చేసుకోవడానికి ఎదుటి వారి బలహీనతలను ఉపయోగించుకుంటున్నారు. ప్రేమిస్తున్నామంటూ.. చెప్పి వారి.. శారీరకంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం.. అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఎదుటి వారిని ప్రేమిస్తున్నామంటూ.. ముగ్గులోనికి దింపుతున్నారు. ఆ తర్వాత.. వారిని ఇతర పనులకు ఉపయోగించుకుంటున్నారు.

మరికొందరు.. పెళ్లి చేసుకుంటామని చెప్పి కూడా యువతులను మోసం చేస్తున్నారు. శారీరకంగా ఉపయోగించుకుంటున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుంటామనగానే.. నమ్మేసి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఆ తర్వాత.. వారి కోరిక తీరగానే ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో తాము మోసాపోయామని తెలిసి యువత సూసైడ్ లకు పాల్పుడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో దారుణమైన ఉదంతం జరిగింది. జైత్ పూర్ లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బీహర్ కు చెందిన ఒక మహిళ (33), తొమ్మిదేళ్లుగా తన భర్తతో గొడవలు జరిగి స్థానికంగా సింగిల్ గా ఉంటుంది. ఆమెకు గౌతమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను.. నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీంతో వీరి మధ్య క్రమంగా చనువు పెరిగింది. దీంతో గత ఎనిమిదేళ్లుగా వీరిద్దరు సహాజీవనం చేస్తున్నారు. అయితే, ఇతను మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. బాగా సెటిల్ అయ్యాక పెళ్లిచేసుకుందామని చెప్పేవాడు. దీంతో ఇతగాడి మాటలు నమ్మిన మహిళ అనేక సార్లు శారీరంగా ఒక్కటయ్యారు.

దీంతో ఎనిమిదేళ్లలో.. అనేక సార్లు ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రతిసారి ఏదో ఒక మాటలు చెప్పి ఆమెతో అబార్షన్ చేయించేవాడు. అలా.. ఎనిమిదేళ్లలో.. 14 సార్లు అబార్షన్ చేయించాడు. అయితే.. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకొవాలంటూ మహిళ అతగాడిని నిలదీసింది. దీంతో అతను ఆమెను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ.. జూల్ 5 న ఇంట్లో సూసైడ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో.. స్థానికులు ఇంట్లో మహిళ విగత జీవిగా ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె దగ్గర సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిదేళ్లుగా శారీరంగా వాడుకుని ముఖం చాటేశాడని, ఆమె ఆధారాలతో సహా దానిలో రాసిపెట్టింది. ఈ క్రమంలో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు బీహర్ లో ఉన్న.. బాధిత మహిలకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Delhi, Female harassment

ఉత్తమ కథలు