Delhi Firing : ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దారుణం... మహిళా ఎస్సైని కాల్చిచంపిన బ్యాచ్‌మేట్?

Delhi Firing : ఈ ఘటన ఎందుకు జరిగింది? కారణం ఎవరు? ఆమెను చంపిందెవరు? బ్యాచ్‌మేట్‌పై పోలీసులు ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Updated: February 8, 2020, 10:25 AM IST
Delhi Firing : ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దారుణం... మహిళా ఎస్సైని కాల్చిచంపిన బ్యాచ్‌మేట్?
Delhi Firing : ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దారుణం... మహిళా ఎస్సైని కాల్చిచంపిన బ్యాచ్‌మేట్? (credit - twitter - Devinder Benipal)
  • Share this:
Delhi Firing at Metro Station : ఢిల్లీలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే... అంతకు ముందు రోజు రాత్రి 9.30 గంటలకు జరిగిన ఓ మర్డర్ కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే... 26 ఏళ్ల మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్‌ ప్రీతి అత్లావత్... ఢిల్లీ రోహిణీ ఏరియా మెట్రో స్టేషన్ నుంచీ ఇంటికి వెళ్తోంది. అంతలో ఎవరో ఆమెపై అనేకసార్లు కాల్పులు జరిపారు. దాంతో... ఆమెను అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఐతే ఆమెను ఎవరు కాల్చి చంపారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం ఆమె ఓ రేప్ కేసును డీల్ చేస్తోంది. ఆ కేసు దర్యాప్తు నుంచీ ఆమెను వెనక్కి వెళ్లాలని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో హత్య జరగడంతో... ఆ కేసుకీ, ఈ హత్యకూ సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులకు దీపాన్షు రథి అనే వ్యక్తిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇతను 2018లో ఆమె బ్యాచ్‌కి చెందినవాడే. శుక్రవారం రాత్రే ఇతను హర్యానాలోని సోనిపట్‌లో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. కాల్పుల ఘటన తర్వాతే ఈ సూసైడ్ జరిగినట్లు సమాచారం. రెండు చోట్లా ఘటనాస్థలాల నుంచీ పోలీసులు... డెడ్ బాడీలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు కాల్పులు జరిగిన ప్రాంతంలో CCTV ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కానీ అది చీకట్లో ఏం తెలియట్లేదు.

ప్రితి అత్లావత్‌... తూర్పు ఢిల్లీలో పత్పర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది. సోనిపట్‌కి చెందిన ఎస్సై దీపాన్షు రథి... రోహిణీలోనే ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. అతను ఆమెను ప్రేమించాడు. ఆమె మాత్రం ప్రేమించలేదు. ఈ క్రమంలో అతనే ఆమెను చంపేసి... సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


Published by: Krishna Kumar N
First published: February 8, 2020, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading