DELHI THIEVES THREATENED A CAR DRIVER AND STOLE 2CRORE RUPEES FROM DICKEY SNR
Delhi:2నిమిషాల్లో 2కోట్లు ఎత్తుకెళ్లారు..ఎంత సింపుల్‌గా పని కానిచ్చారో మీరే చూడండి
Photo Credit:Youtube
Delhi: దేశ రాజధానిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాత్రి 9గంటల ప్రాంతంలో రోహిణి ప్రాంతంలో కారును ఆపి అందులో ఉన్న కోటి 97లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఈ రాబరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ రాబరీ జరిగింది. ముందుగానే పథకం వేసుకున్న దొంగలు (Thieves)పక్కాగా స్కెచ్‌ని అమలు చేశారు. కారులో కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని తెలుసుకొనే దోపిడీకి పాల్పడ్డట్లుగా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈనెల 29వ తేది మంగళవారం రాత్రి 9.15నిమిషాల సమయంలో ఢిల్లీలోని రోహిణిలో భారీ దోపిడీ జరిగింది. రోహిణి సెక్టార్ 22లో నివాసముంటున్న నరేంద్రకుమార్ అగర్వాల్ (Narendrakumar Agarwal)అనే వ్యక్తి సెక్టార్ 24లో ఉంటున్న తన మేనల్లుడు కరణ్ అగర్వాల్ (Karan Agarwal)ఇంటికి కారులో ఇంటి నుంచి బయల్దేరాడు. కారును డ్రైవర్ ధర్మేంద్ర (Dharmendra)నడుపుతుండగా నరేంద్రకుమార్ అగర్వాల్ వెనుక సీటులో కూర్చున్నాడు. కారు సెక్టార్ 24కి చేరుకోగానే..ఒక బాలుడు స్కూటీ(Scooty)పై వచ్చి కారు ముందు తన వాహనాన్ని ఆపాడు. అక్కడి నుంచి డ్రైవర్ ధర్మేంద్ర దగ్గరకు వచ్చి కారు అద్దాలు పగలగొట్టి అతని దగ్గరున్న కారు డిక్కీ తాళాలు గుంజుకున్నాడు. డిక్కీ తెరవడంతో మరో ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చారు. వచ్చిన వాళ్లంతా ఒకే గ్రూప్‌కి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. వెంటనే డిక్కీలో మూడు బస్తాల్లో ఉన్న డబ్బులు తీసుకొని పరార్ అయ్యారు. అయితే కారు డిక్కీలో ఉన్న మూడు సంచుల్లో డబ్బు ఎంతో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. కోటి 97లక్షల రూపాయల(1Crore 97 Lakhs) నోట్ల కట్టల్ని గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఈ రాబరీ దృశ్యాలు రోహిణి సెక్టార్ స్ట్రీట్‌లైట్ దగ్గర లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా(CC Camera)లో రికార్డయ్యాయి.
రాజధానిలో రాబరీ..
దోపిడీ అంతా రెండు, మూడు నిమిషాల్లో జరిగిపోవడంతో దొంగలు ఎవరూ ? డబ్బులు ఎక్కడికి ఎత్తుకెళ్లారనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే కారులో ఉన్న నరేంద్రకుమార్ అగర్వాల్ ఈ పెద్ద మొత్తం నగదును చాందిని చౌక్ నుంచి సేకరించారు. అంత డబ్బు కారు డిక్కీలో పెట్టుకొని వెళ్తున్న నరేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ సేకరించారు. అంత డబ్బును ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాటికి సంబందించిన లెక్కలు ఏమిటని బాధితుడ్ని ప్రశ్నించారు.
రెండు నిమిషాల్లో రెండు కోట్లు మాయం..
సంచుల్లో నింపి ఉన్న కోట్ల రూపాయల నగదు..నిజంగా సక్రమంగా సంపాధించిన డబ్బేనా లేక అక్రమంగా లూఠీ చేసిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కారు ముందు బైక్‌ని ఆపి డబ్బులు దోచుకెళ్లిన వారి టూ వీలర్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు దొంగిలించిన వ్యక్తులు బాధితుడికి పరిచయం ఉన్న వ్యక్తులే అయివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.