స్నేహితుడి తలపై నాటు తుపాకి పెట్టి టిక్ టాక్ వీడియో... అంతలోపే..

ఒకరికి టిక్ టాక్ వీడియో చేద్దామన్న ఆలోచన వచ్చింది. కారులో కూర్చున్న మరో స్నేహితుడి తలపై నాటుతుపాకిపెట్టి టిక్ టాక్ చేసేందుకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: April 15, 2019, 8:48 AM IST
స్నేహితుడి తలపై నాటు తుపాకి పెట్టి టిక్ టాక్ వీడియో... అంతలోపే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
20 ఏళ్లలోపు ముగ్గురు యవకులు. ముగ్గురూ స్నేహితులు. సరదాగా బయటకు వెళ్లారు. కారు తీశారు. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామంటూ ముగ్గూరు కలిసి ఢిల్లీ గేటు వద్దకు వెళ్లారు. ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఒకరికి టిక్ టాక్ వీడియో చేద్దామన్న ఆలోచన వచ్చింది. కారులో కూర్చున్న మరో స్నేహితుడి తలపై నాటుతుపాకిపెట్టి టిక్ టాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే అది ప్రమాద వశాత్తు పేలడంతో అక్కడికక్కడే ఆ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని న్యుజఫారాబాద్‌కు చెందిన 19 ఏళ్ల సల్మాన్ ఇంట్లో చిన్నకొడుకు. తండ్రి వ్యాపార వేత్త. ఓ అన్న, అక్క కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి స్నేహితులు సోహెల్, అమిర్ ఇంటికి వచ్చి ఇండియా గేట్ వద్దకు వెళ్దామంటూ పిలిచారు. దీంతో కారు తీసుకొని సల్మాన్ ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలోలసోహిల్ కారు డ్రైవ్ చేస్తుండగా సల్మాన్ అతని పక్కనే కూర్చున్నాడు. సోహిల్ కారు డ్రైవ్ చేస్తూ.. తన వెంట తెచ్చి నాటు తుపాకి బయటకు తీశాడు. టిక్ టాక్ వీడియో చేద్దామంటూ సల్మాన్ నెత్తిన గురిపెట్టాడు. ఇంతలో అది ప్రమాద వశాత్తు పేలి.. సల్మాన్ ఎడమ చెంపవైపు దూసుకెళ్లింది. అంతే సల్మాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

కారు రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ దగ్గరకు వెళ్లగానే బారాకంబ్ రోడ్డుమీద ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే సోహిల్.. అక్కడకు దగ్గర్లో ఉన్న దర్యాగంజ్ ప్రాంతంలోని బంధువులను సంప్రదించాడు. వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ రక్తంతో తడిసిన దుస్తుల్ని మార్చుకున్నాడు. దగ్గర్లో ఉన్న LNJP ఆస్పత్రికి సల్మాన్‌ను తీసుకెళ్లారు. అయితే అప్పటికే సల్మాన్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోహిల్,అమిర్‌తో పాటు... సోహిల్ బంధువులు షరీఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకి ఎందుకు తీసుకెళ్లారు? ఇది ప్రమాదామా లేక ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ బాడీని పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు