హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: రెండేళ్లుగా బాలికతో ఛాటింగ్.. సడెన్ గా అవాయిడ్ చేస్తుందని.. ఏంచేశాడంటే..

Shocking: రెండేళ్లుగా బాలికతో ఛాటింగ్.. సడెన్ గా అవాయిడ్ చేస్తుందని.. ఏంచేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: బాలికతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య స్నేహానికి దారితీసింది. ఈ క్రమంలో.. ఇద్దరు సోషల్ మీడియాలో ప్రతీదీ, షేర్ చేసుకునేవారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

సోషల్ మీడియా  (Social media) అందుబాటులోకి వచ్చాక అనేక రకాల వేధింపులు ఎక్కువయ్యాయి. ఏమాత్రం తెలియని వారినుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వస్తున్నాయి. కొందరు కావాలని అమ్మాయిల డీపీలను పెట్టుకుని, అవతలి వారికి వలపు వల విసురుతున్నారు. ఇదంతా నిజమని కొంత మంది అబ్బాయిలు నమ్మి చాటింగ్ చేస్తున్నారు. హస్కీగా మాట్లాడి కొన్నిరోజుల పాటు చాటింగ్ చేసి ఆ తర్వాత.. తమ అసలు రంగును బయటపెడుతున్నారు. మరికొందరు.. అమ్మాయిలు కూడా కొన్నిచోట్ల మోసపోతున్నారు. తెలియని వారి నుంచి వచ్చిన రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేసి.. చిక్కుల్లో పడుతున్నారు. మొదట్లో మంచి వారిలాగా చాటింగ్ చేస్తూ ఆతర్వాత.. వేధింపుల పర్వం మోదలేడుతున్నారు.


మరికొన్ని చోట్ల కేటుగాళ్లు.. చాటింగ్ చేయకపోతే.. అసభ్య వీడియోలు, సందేశాలను పంపిస్తున్నారు. అమ్మాయిల ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమ కోరిక తీర్చకపోతే.. పబ్లిక్ లో మార్ఫింగ్ ఫోటోలు, చాటింగ్ లు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఉండే 16 ఏళ్ల బాలిక, ఇంటర్ చదువుతుంది. ఆమెకు.. అర్మాన్ అలీ అనే యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలసి తరచుగా చాటింగ్ చేసుకునే వారు. అయితే.. గత రెండేళ్లుగా చాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలో కొన్నిరోజులగా బాలిక అర్మాన్ అలీని అవాయిడ్ చేస్తుంది. అతగాడి మెసెజ్ లకు రిప్లై ఇవ్వడం మానేసింది. దీంతో అతను కోపంతో కంట్రోల్ తప్పాడు. బాలికపై కోపం పెంచుకున్నాడు.


ఈ క్రమంలో.. అతను బాబీ, పవన్ అనే ఇద్దరు మిత్రులను కలసి బాలికపై దాడిచేయడానికి ప్లాన్ వేశారు. రోజులాగే గత గురువారం.. బాలిక ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న బాలికపై కాల్పులు జరిగాయి. నిందితులు బాలికపై పలుమార్లు కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే బాలికను.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.


ఆమెకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


First published:

Tags: Crime news, Delhi