Home /News /crime /

DELHI SIX MEMBER WOMEN GANG STRIKE AT INA MARKET SHOP DECAMP WITH CASH AND OTHER VALUABLES INCIDENT CAUGHT ON CCTV PAH

Lady Gang: వామ్మో.. కిలేడీ గ్యాంగ్.. వీరి ట్యాలెంట్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: ఆరుగురు సభ్యుల కిలేడీ గ్యాంగ్ షాపులో చోరబడ్డారు. ఆ తర్వాత మెల్లగా షట్టర్ పగల కొట్టి, లోపలికి ప్రవేశించారు.

ఇప్పటి వరకు చోరీలను ఎక్కువగా మగవాళ్లు చేయడం మనకు తెలిసిందే. మరీ అన్నింటిలో సమానత్వం సాధిస్తున్నాం.. మరీ చోరీల్లో కూడా ఏం తక్కువ అనుకున్నారో ఏంటో కానీ ఒక లేడీ బ్యాచ్ రెచ్చిపోయారు. ఆరుగురు సభ్యులుగా ఏర్పడి దేశ రాజధానిలోని ఒక సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) మహిళా గ్యాంగ్ హల్ చల్ చేశారు. ఐఎన్ఏ పరిధిలో ఉన్న సూపర్ మార్కెట్ లో గురువారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఆరుగురు సభ్యులు షట్టర్ తాళాలు పగల కొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ముఖానికి నల్లని మాస్క్ లు, నలుపు బట్టులు వేసుకుని ఉన్నారు. ఆ తర్వాత.. అక్కడ ఉన్న కౌంటర్ లో ఉన్న నగదును బ్యాగ్ లో వేసుకున్నారు.

విలువైన సామానులను తమ సంచులలో వేసుకున్నారు. ఆరుగురు కూడా ఏమాత్రం భయంలేకుండా కోఆర్డినేషన్ తో వచ్చిన పని కానిచ్చారు. ఈ బాగోతం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఉదయాన్నే షాపు ఓనర్ షట్టర్ తెరవడానికి వచ్చాడు. దీంతో ఈ బాగోతం కాస్త బయటపడింది.

ఇదిలా ఉండగా ఒక మాయగాడు లేడీ పోలీసునే మోసం చేశాడు.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  ఈ సంఘటన జరిగింది. ఒక సునీతావర్మ మహిళ మీరట్ లోని గౌతమ్ బుద్ధనగర్ లో ఉంటుంది. అయితే, ఆమె భర్త చనిపోయారు. ఈ క్రమంలో ఆమె.. రెండో పెళ్లికోసం మ్యాట్రిమోనియల్ (Cyber fraud)  సైట్లలో అనేక మ్యాచెస్ లను చూస్తుంది. ఆ సమయంలో సంజయ్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ఒక ఎన్నారై అని.. ప్రస్తుతం ఢిల్లీలోని టెలికామ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. తన తల్లి కెనడాలో ఉంటుందని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కెనడాలో వెళ్లి సెటిల్ అవుతామని చెప్పాడు.

నీకు ఇష్టమైతే పెళ్లి (Wedding fraud)  చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. పాపం.. బాధిత మహిళ అతగాడి మాటలను నమ్మింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తన మేనల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందని తన ఏటీమ్ లను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. దీంతో మహిళ 2 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల పాటు అలాగే మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత.. విడుతల వారిగా.. 60 లక్షల వరకు వసూల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. తన లావాదేవీలను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని... సునీత వర్మకు అనుమానం వచ్చింది. సునీత వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Gang robbery, Theft

తదుపరి వార్తలు