దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గురువారం అనుకొని ప్రమాదం జరిగింది. పహర్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల ప్రకారం.. ఖన్నా మార్కెట్, ది వివేక్ హోటల్ సమీపంలో ఉన్న పహర్ గంజ్ ప్రాంతంలో ఇల్లు (Building collapse) కుప్పకూలింది.
స్థానికులు వెంటనే పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఏడు ఫైరింజన్ లు అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మూడేళ్ల చిన్నారి, ఇద్దరు బాలికలు, వారి తండ్రిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతుందని అన్నారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాలతో అల్లాడుతున్న ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది.
మలాద్ వెస్ట్‌లోని మల్వాని ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. బుధవార రాత్రి 11 గంటల సమంయలలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని బీడీబీఏ మున్సిపల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో ఇప్పుడే చెప్పలేమి.. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
భారీ వర్షాలకు నానడం వల్లే భవనం కూలిపోయిందని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. ముందుజాగ్రత్తగా ఆ భవనం సమీపంలో ఉన్న పలు పురాతన భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ భవనం వయసు ఎంత? ఎన్ని సంవత్సరాల కింద కట్టారు? శిథిలావస్థలో ఉండడం వల్లే కూలిపోయిందా? లేదంటే నాణ్యత లేకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందా? అనే కోణాలో ఆరా తీస్తున్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు రోజులు ముంబైతో పాలు పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. వాతావరణశాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీచేసింది. మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. తీర ప్రాంతా జిల్లాల్లో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాయి. ముంబైలో మూడు, సింధుదుర్గ్‌లో నాలుగు, థానే, రాయగఢ్, పాల్ఘర్, రత్నగిరి జిల్లాల్లో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Building Collapse, Delhi