హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Serial Killer: 30 మందిని బలిగొన్న మానవ మృగానికి శిక్ష ఖరారు..ఆ బాలికల ఉసురు ఊరికే పోతుందా?

Serial Killer: 30 మందిని బలిగొన్న మానవ మృగానికి శిక్ష ఖరారు..ఆ బాలికల ఉసురు ఊరికే పోతుందా?

మానవమృగానికి శిక్ష ఖరారు

మానవమృగానికి శిక్ష ఖరారు

Crime News: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది అభం శుభ తెలియని చిన్నారులు ఆ నీచుడి చేతిలో నరకయాతన అనుభవించారు. అయినా ఆ మృగం వదిలిపెట్టలేదు..హింసించింది సరిపోక ప్రాణాలను సైతం తీసి పైశాచిక ఆనందం పొందాడు. 30 మంది మైనర్ బాలికల ఉసురు ఊరికే పోతుందా..ఫలితంగా ఇప్పుడు చిమ్మ చీకట్లో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక తాజాగా ఆ మానవ మృగానికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. 30 మందికి పైగా మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి..లైంగిక దాడికి పాల్పడి..ప్రాణాలు తీసిన మనిషి రూపంలో ఉన్న మానవ మృగానికి కోర్టు శిక్ష ఖరారు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Crime News: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది అభం శుభ తెలియని చిన్నారులు ఆ నీచుడి చేతిలో నరకయాతన అనుభవించారు. అయినా ఆ మృగం వదిలిపెట్టలేదు..హింసించింది సరిపోక ప్రాణాలను సైతం తీసి పైశాచిక ఆనందం పొందాడు. 30 మంది మైనర్ బాలికల ఉసురు ఊరికే పోతుందా..ఫలితంగా ఇప్పుడు చిమ్మ చీకట్లో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక తాజాగా ఆ మానవ మృగానికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. 30 మందికి పైగా మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి..లైంగిక దాడికి పాల్పడి..ప్రాణాలు తీసిన మనిషి రూపంలో ఉన్న మానవ మృగానికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషి రవీంద్ర కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని రోహిణి కోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఆరేళ్ల చిన్నారిని హింసించి చంపిన కేసులో గతంలోనే దోషిగా తేల్చిన కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన 18 ఏళ్ల రవీంద్ర కుమార్..తన కుటుంబంతో కలిసి 2008లో ఢిల్లీకి వలస వచ్చాడు. రవీంద్రకుమార్ తండ్రి ప్లంబర్ పని చేస్తుండగా..తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఇక రవీంద్ర కుమార్ రోజు కూలికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో రోజంతా పని చేసే రవీంద్ర రాత్రిళ్లు గంజాయి తీసుకునేవాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిద్రలేచి మురికివాడలు గాని నిర్మానుష్య ప్రదేశాలకు గాని వెళ్లేవాడు. అక్కడ దొరికిన పిల్లలను ఎవరూ లేని ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా హింసించి ఆ తరువాత చంపేవాడు.

ఇలా 2014లో కూడా ఆరేళ్ల పాపను చంపిన రవీంద్ర మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. 2008 నుంచి 2014 వరకు రవీంద్ర కుమార్ ఏకంగా 30 మంది మైనర్ బాలికలను హింసించి హత మార్చినట్లు తెలిసింది.వీరంతా కూడా 6 నుంచి 12 ఏళ్ల కలవారే కావడం సంచలనంగా మారింది. అయితే పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న రవీంద్రను 2015లో ఢిల్లీలోని సుఖ్ బీర్ నగర్ లో అరెస్ట్ చేశారు.

వామ్మో.. ఇదేం దవాఖానా రా నాయన.. ఏ4 కాగితంపై ఎక్స్-రే ప్రిటింగ్.. ఎక్కడో తెలుసా..?

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు రవీంద్ర కుమార్ ను ఇప్పటికే దోషిగా తేల్చింది. మొత్తం 30 మందిపై హింసించి చంపినట్లు ఆరోపణలు ఉండగా..కేవలం 3 కేసుల్లోనే విచారణ జరిగింది. ఇందులో ఓ కేసులో తాజాగా రోహిణి కోర్టు నిందితునికి జీవితఖైదు శిక్ష విధించింది.

First published:

Tags: Crime, Delhi

ఉత్తమ కథలు