హోమ్ /వార్తలు /క్రైమ్ /

Murder : స్టార్ రెజ్లర్ కోసం గాలిస్తున్న 50 మంది పోలీసులు.. హత్య జరిగిన రోజు ఏం జరిగింది?

Murder : స్టార్ రెజ్లర్ కోసం గాలిస్తున్న 50 మంది పోలీసులు.. హత్య జరిగిన రోజు ఏం జరిగింది?

సుశీల్ కుమార్ కోసం 50 మంది పోలీసులతో కూడిన 8 బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి

సుశీల్ కుమార్ కోసం 50 మంది పోలీసులతో కూడిన 8 బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి

అతడు రెండు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన స్టార్ రెజ్లర్. అడుగు బయట పెడితే పెద్ద సంఖ్యలో అభిమానలు చేరే వారు. వారిని అదుపు చేయడానికి పోలీసు సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఒక హత్యానేరంలో ఇరుక్కొని అదే పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు.

ఇంకా చదవండి ...

రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన చాంపియన్, భారత స్టార్ రెజ్లర్ (Wrestler) సుశీల్ కుమార్ (Susheel Kumar) కోసం ఢిల్లీ పోలీసులు (Delhi Police) తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో సుశీల్ కుమార్ చితకబాదిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆనాటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రస్తుతం సుశీల్ కుమార్ మీద హత్యానేరంతో (Murder Case) పాటు మరి కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సుశీల్ కోసం 50 మంది పోలీసులు ఢిల్లీ-హర్యాణా సరిహద్దుల్లో వెతుకుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, అసలు మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి ఏం జరిగిందో ఢిల్లీ పోలీసులు వివరించారు. సాగర్ దండక్ (23), సోనూ మహల్, అమిత్ కుమార్‌లపై సుశీల్ కుమార్ మరియు అతడి స్నేహితులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో సాగర్ దండక్ మృతి చెందాడు. అతడు గతంలో జూనియర్ నేషనల్ చాంపియన్. ఆ తర్వాత సీనియర్ జట్టులో చేరి శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సుశీల్‌తో అతడికి స్నేహం కుదిరింది. ఛత్రాసాల్ సమీపంలోని మోడల్ టౌన్‌లో సుశీల్‌కు ఉన్న ఇంటిలోనే సాగర్ అద్దెకు ఉండేవాడు. గత కొన్నాళ్లుగా సాగర్ ఆ ఇంటి అద్దె చెల్లించలేదు. అంతే కాకుండా పలు మార్లు అందరి ముందూ సుశీల్‌ను అవమానిస్తూ మాట్లాడేవాడని పోలీసులు చెప్పారు. దీంతో కక్ష పెంచుకున్న సుశీల్ అతడి స్నేహితులు కలసి పథకం ప్రకారమే దాడి చేసినట్లు చెబుతున్నారు.

దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న సుశీల్ కుమార్ స్నేహితుడు ప్రిన్స్ దలాల్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించారు. అతడి ఫోన్‌లో దాడికి సంబంధించిన వీడియో లభించింది. అందులో సుశీల్ దాడి చేసినట్లు స్పష్టంగా కనపడినట్లు తెలుస్తున్నది. మరోవైపు ప్రిన్స్ దలాల్ రోహ్‌తక్ యూనివర్సిటీలో మూడో ఏడాది చదువుతున్నాడు. అతడికి నవీన్ బాలీ అనే గ్యాంగ్ స్టర్‌తో సంబంధాలు ఉన్నాయి. నవీన్ బాలీ సన్నిహితుడి కార్లనే దాడి సమయంలో ఉపయోగించారు. దీంతో ఈ దాడిలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.


కాగా, దాడి జరిగినప్పుడు గాయాల పాలైన సోనూ మహల్ కూడా సుశీలే గొడవకు దిగాడని.. అతడే కావాలని ఘర్షణ మొదలు పెట్టాడని పోలీసులకు చెప్పాడు. ఒకప్పుడు స్టార్ రెజ్లర్‌గా పేరు తెచ్చుకున్న సుశీల్ కుమార్ చివరకు హత్య కేసులో ఇరుక్కోవడం పట్ల అతడి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఇకపై సుశీల్ కుమార్‌ను రెజ్లింగ్ పోటీల్లో చూసే వీలుండదేమో అని బాధపడుతున్నారు.

First published:

Tags: Delhi police, Murder, Susheel kumar, Wrestling

ఉత్తమ కథలు