రాజధానిలో రేవ్ పార్టీ...నగ్న నృత్యాలతో అమ్మాయిల చిందులు...అదుపులో వీఐపీలు

నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పబ్బులో గుమిగూడారని, అర్ధరాత్రి మద్యం, హుక్కా తాగినట్లు పశ్చిమ్ విహార్ ఈస్ట్‌కు చెందిన పోలీసులకు సమాచారం అందింది.

news18-telugu
Updated: August 10, 2020, 11:03 PM IST
రాజధానిలో రేవ్ పార్టీ...నగ్న నృత్యాలతో అమ్మాయిల చిందులు...అదుపులో వీఐపీలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం రేపుతుంటే....కొంత మంది బాధ్యత మరిచిన యువత పబ్బుల్లో గబ్బు పనులు చేస్తూ ప్రభుత్వ చర్యలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో సంక్రమణ ప్రమాదాన్ని నివారించడానికి, దేశవ్యాప్తంగా ప్రజలు కఠినమైన నియమాలను పాటిస్తుండగా, రాజధాని ఢిల్లీలోని పశ్ఛిమ్ విహార్ ప్రాంతంలోని ఓ పబ్బులో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పబ్బులో గుమిగూడారని, అర్ధరాత్రి మద్యం, హుక్కా తాగినట్లు పశ్చిమ్ విహార్ ఈస్ట్‌కు చెందిన పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్టీలో యువతలో ఎక్కువ మంది పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం పోలీసుల బృందం పబ్బుపై దాడి చేసింది.

మొత్తం 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పూర్తిగా మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక్కడి నుంచి పోలీసులు 55 మద్యం సీసాలు, 8 హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. అంటువ్యాధి చట్టం, ఎక్సైజ్ చట్టం, ఇతర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటికే ఈ పబ్బుపై నుండి రెండుసార్లు అలాంటి చర్య తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొదటి సారి పోలీసులు రేవ్ పార్టీ చేస్తున్నప్పుడు 29 మందిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో వీఐపీల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading