• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DELHI POLICE CONSTABLE ALLEGEDLY COMMITTED SUICIDE AFTER HE KILLED HIS PARENTS AT HIS HOME SSR

దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్.. గొడ్డలికి అంటుకున్న రక్తం, తెల్ల వెంట్రుకలే తేల్చేశాయి..!

దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్.. గొడ్డలికి అంటుకున్న రక్తం, తెల్ల వెంట్రుకలే తేల్చేశాయి..!

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి తల్లిదండ్రులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని సోనిపట్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే..

  • Share this:
    న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి తల్లిదండ్రులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని సోనిపట్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. హర్యానాకు చెందిన దీపక్(39) ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కారణమేంటో తెలియరాలేదు గానీ దాదాపు 65 ఏళ్ల వయసు పైబడిన తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గొడ్డలితో నరికి చంపాడు.

    దీపక్ రూమ్‌లో పోలీసులు వెతకగా.. ఓ గొడ్డలి దొరికింది. ఆ గొడ్డలి ముందు ఉండే పదునైన భాగం రక్తంతో తడిసి, తెల్ల వెంట్రుకలు ఆ రక్తంలో పోలీసులకు కనిపించాయి. తల్లిదండ్రులిద్దరినీ చంపిన దీపక్ అనంతరం వారి మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత.. తాను కూడా విషం తాగి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపక్ కూడా చనిపోయాడు.

    దీపక్.. ఈ హత్యలకు, ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. సగం కాలిన ఆ వృద్ధుల శరీరాలను గుర్తించారు. ఘజియాబాద్‌లో కూడా ఓ ఇద్దరి హత్య కలకలం రేపింది. దూరపు బంధువు ఇంట్లో దోపిడికి పాల్పడిన ఇద్దరు మహిళలు ఒక మహిళతో పాటు 16 ఏళ్ల వయసున్న బాలికను కూడా హత్య చేశారు. అనంతరం.. దోచుకున్న సొమ్ముతో పరారయ్యారు. పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు