హోమ్ /వార్తలు /క్రైమ్ /

న్యాయవాదిపై పగ పెంచుకున్న DRDO శాస్త్రవేత్త ఏం చేశాడంటే -Rohini Court కేసులో ఊహించని ట్విస్ట్

న్యాయవాదిపై పగ పెంచుకున్న DRDO శాస్త్రవేత్త ఏం చేశాడంటే -Rohini Court కేసులో ఊహించని ట్విస్ట్

రోహిణి కోర్టులో పేలుడు దృశ్యాలు(ఈనెల 9నాటివి)

రోహిణి కోర్టులో పేలుడు దృశ్యాలు(ఈనెల 9నాటివి)

రోహిణి కోర్టు(ఢిల్లీ జిల్లా కోర్టు)లో ఈనెల 9న చోటుచేసుకున్న పేలుడుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు ఉగ్రవాదుల పనే అని భావించినా, చివరికి డీఆర్డీవో సైంటిస్టు నిందితుడిగా తేలాడు. అతనా పని ఎందుకు చేశాడో తాజాగా వెల్లడైంది..

ఇంకా చదవండి ...

దేశ రాజధాని ఢిల్లీలో ప్రఖ్యాత రోహిణి కోర్టు(ఢిల్లీ జిల్లా కోర్టు)లో పది రోజుల కిందట సంభవించిన పేలుడు ఘటనకు సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా ఇది ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని తొలుత అనుమానించినా.. అనూహ్య రీతిలో పేలుడుకు పాల్పడింది ఒక శాస్త్రవేత్త అని తేలడంతో అందరూ విస్తుపోయారు. వరుసగా కేసులు వేసి చికాకు తెప్పిస్తున్నాడనే కోపంతో లాయర్ పై పగ పెంచుకున్న DRDO సైంటిస్టు ఎవరూ ఊహించని పనికి పూనుకున్నాడు. లాయర్ ను అంతం చేయడానికి ఏకంగా ల్యాప్ టాప్ బాంబును తయారు చేసి, కోర్టు హాలోలో పేలుడుకు పాల్పడ్డాడు. రోహిణి కోర్టు పేలుడు కేసును దర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ పోలీసులు ఈ మేరకు డీఆర్డీవో సైంటిస్టును అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, డీఆర్డీవో విశ్వసనీయ వర్గాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

ఈనెల 9న దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో పేలుడు సంభవించడం తెలిసిందే. అంతకు కొద్ది రోజుల ముందు ఇదే కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేంద్ర గోగిని లాయర్ వేషంలో వచ్చిన దుండగులు కాల్చి చంపడంతో కోర్టులో భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. రోహిణి కోర్టుకు భద్రత విషయంలో శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే ఈనెల 9న మరో ఘటనగా పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులోని రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్ లో ఉంచిన ల్యాప్ టాప్ పేలిపోగా, ఒక వ్యక్తి గాయపడ్డాడు. ల్యాప్ టాప్ బ్యాటరీలో సాంకేతిక సమస్య వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చన్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేయగా, అనూ హ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి..

shocking : మహిళ కాలేయం(Liver)లో పిండం పెరుగుదల -అత్యంత అరుదైన Pregnancy.. ప్రమాదమా? కాదా?రోహిణి కోర్టులో పనిచేస్తోన్న ఓ సీనియర్ లాయర్ టార్గెట్ గానే ఈ పేలుడు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ల్యాప్ టాప్ బాంబును తయారు, కోర్టులోకి తీసుకొచ్చిన నిందితుడిని డీఆర్డీవో సైంటిస్టుగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి బ్యాగుతో లోనికి రావడం, తిరిగి వెళ్లేటప్పుడు చేతిలో బ్యాగ్ లేకపోవడం, టార్గెట్ అయిన లాయర్ కదికలకలు, ఆ బ్యాగుపై ముద్రించి ఉన్న లోగో.. తదితర ఆధారాలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన పోలీసులు.. ఉన్నతాధికారుల అనుమతితో డీఆర్డీవో సైంటిస్టును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడు..

up elections వేళ.. సమాజ్ వాదీ పార్టీ నేతల ఇళ్లపై IT raids.. బీజేపీపై Akhilesh Yadav ఫైర్రోహిణి కోర్టులో పనిచేస్తోన్న సీనియర్ న్యాయవాదితో డీఆర్డీవో సైంటిస్టుకు కొంతకాలంగా విభేదాలున్నాయి. సైంటిస్టుపై లాయర్ కనీసం 10 కేసులను వేశాడు. ఈ కేసుల వల్ల సైంటిస్ట్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. కేసులు వేసిన లాయర్ పై పగ పెంచుకున్న సైంటిస్ట్.. పథకం ప్రకారం లాయర్ ను అంతం చేయడాగనికి ల్యాప్ టాప్ లో బాంబు అమర్చి కోర్టులోనే పేలుడుకు పాల్పడ్డాడు. అయితే ఘటనలో సదరు లాయర్ తప్పించుకోగలిగాడు. అసలు ఏ విషయంలో సైంటిస్టుపై లాయర్ కేసులు వేశాడు? పేలుడు పదార్థాలను సైంటిస్టు ఎక్కడి నుంచి సేకరించాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. రోహిణి కోర్టు కేసులో అరెస్టయిన డీఆర్డీవో సైంటిస్టుకు ఐఈడీ బాంబులు కూడా తయారు చేయడం వచ్చని, ఈ విషయాన్ని పోలీస్ విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది.

Published by:Madhu Kota
First published:

Tags: BLAST, Delhi, DRDO, Scientist

ఉత్తమ కథలు