హోమ్ /వార్తలు /క్రైమ్ /

Psycho Lover: తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని 35 ముక్కలుగా నరికాడు .. ముక్కల్ని ఏం చేశాడంటే

Psycho Lover: తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని 35 ముక్కలుగా నరికాడు .. ముక్కల్ని ఏం చేశాడంటే

KILLER(Photo:Twitter)

KILLER(Photo:Twitter)

Psycho Lover: తల్లిదండ్రుల్ని కాదని ప్రియుడితో కలిసి జీవించాలని వచ్చిన ఓ యువతి జీవితం అత్యంత దారుణంగా ముగిసింది. నమ్మిన వాడే నరరూప రాక్షసుడిగా మారాడు. ప్రేమించానని చెప్పి..శారీరక సంబంధం పెట్టుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ఉన్మాదిగా మారాడు. ఓ సైకోలా ప్రవర్తించి ఎవరూ ఊహించనంత దారుణంగా ప్రేమించిన అమ్మాయిని చంపి ముక్కులుగా చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని ప్రియుడితో కలిసి జీవించాలని వచ్చిన ఓ యువతి జీవితం అత్యంత దారుణంగా ముగిసింది. నమ్మిన వాడే నరరూప రాక్షసుడిగా మారాడు. ప్రేమించానని చెప్పి..శారీరక సంబంధం పెట్టుకొని తీరా పెళ్లి చేసుకోమనే సరికే ఉన్మాదిగా మారాడు. ఓ సైకో(Psycho)లా ప్రవర్తించి ఎవరూ ఊహించనంత దారుణంగా ప్రేమించిన అమ్మాయిని హత్య చేసి ముక్కులు కట్ చేసాడు. ఎవరికి అనుమానం రాకుండా శవం ముక్కల్ని ఫ్రిజ్‌ (Fridge)లో దాచి పెట్టి 15రోజుల తర్వాత వాటిని ఒక్కో చోట ఒక్కో శరీర భాగం పాడేసి చేతులు దులుపుకున్నాడు. ఢిల్లీ(Delhi)లో జరిగిన ఈ కిరాతక ఘటన ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు(Police)ఆ నరరూప రాక్షసుడ్ని అరెస్ట్ చేశారు.

Viral video: సాధారణ వ్యక్తి కాళ్లు మొక్కిన బ్రిటర్ ప్రధాని అత్తగారు .. వైరల్ అవుతున్న సుధా మూర్తి వీడియో

ప్రేమికుడి ఉన్మాదం...

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రేమికుడు ఉన్మాదంతో ..సైకోలా ప్రవర్తించాడు. అప్తాబ్ అమీన్‌ పూనావాల అనే పాతికేళ్ల యువకుడు శ్రద్ధ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే శ్రద్ధ తల్లిదండ్రులు ఒప్పుకోకపోడంతో ప్రియుడే కావాలని ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది శ్రద్ధ. ఇద్దరూ కలిసి మెహ్రౌలీ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఈసంవత్సరం మే నెల 18వ తేదిన శ్రద్ధను ప్రియుడు ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి చంపిన తర్వాత యువతి హత్య చేసినట్లు తెలియకుండా ఆమె శరీరాన్ని 35ముక్కులుగా నరికి వాటిని భద్రపరిచేందుకు ఓ ఫ్రిజ్‌ని కొనుగోలు చేశాడు.

సైకోలా ప్రవర్తించాడు..

ప్రియురాలి శవాన్ని మటన్‌లా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఆఫ్తాబ్ 18రోజుల్లో ఢిల్లీలోని వేర్వేరు చోట్ల వాటిని విసిరేసి చేతులు దులుపుకున్నాడు. అయితే ముక్కలుగా నరికిన ప్రియురాలి మృతదేహం శరీరాన్ని ఫాలిథిన్ కవర్‌లో ప్యాక్ చేసుకొని తెల్లవారు జామునే రెండు గంటల సమయంలో వాటిని తీసుకెళ్లి పారేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మృతురాలు ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి చెందిన కాల్‌ సెంటర్‌లో జాబ్ చేస్తోంది.అక్కడే అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటే పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి ఢిల్లీకి వచ్చారు. సహజీవనం చేస్తున్నారు.

ప్రేమించిన అమ్మాయిని ముక్కలు చేశాడు..

అయితే శ్రద్ధ ఆచూకి తెలియకపోవడం, ఆమె ఫోన్‌ స్విచ్ ఆఫ్ కావడంతో తండ్రికి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడు ఆఫ్తాబ్ అమీన్‌ పూనావాలగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారించడంతో అసలు విషయాలు బయటకువచ్చాయి.

Sad News: మూడేళ్ల కూతురు కోసం కదులుతున్న ట్రైన్‌లోంచి దూకిన తండ్రి .. అసలేం జరిగిందంటే

నరరూప రాక్షసుడు..

నిందితుడు అఫ్తాబ్, మృతురాలు శ్రద్ధ ఐదు నెలలకు ముందు ఢిల్లీకి వచ్చి గుట్టుగా ఉంటున్నారు. శ్రద్ధ ప్రియుడ్ని పెళ్లి చేసుకుందామని కోరింది. అందుకు అతను నిరాకరించినట్లుగా తేల్చారు పోలీసులు. అదే క్రమంలో ఇద్దరూ గొడవపడుతూ ఉండటంతో విసిగిపోయిన ఆఫ్తాబ్ ఆమెను గొంతు కోసి చంపేసినట్లు విచారణలే తేల్చారు పోలీసులు.

First published:

Tags: Crime news, Delhi news, Lover cheating, National News

ఉత్తమ కథలు