Affair: భర్తకు వయసైపోయిందనుకుందో.. కుర్రాడితో ఎంజాయ్ చేయాలనుకుందో.. కానీ ఆమె అనుకుంది వేరు.. జరిగింది వేరు..

రోహన్, బబిత

దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ ప్రాంతానికి చెందిన బబిత(41), భీమ్‌రాజ్(45) భార్యాభర్తలు. పెళ్లయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. బీఎస్‌ఈఎస్‌లో భీమ్‌రాజ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

 • Share this:
  ఢిల్లీ: ఆమె వయసు 41 సంవత్సరాలు. ఆమె భర్త వయసు 45 సంవత్సరాలు. తన కంటే వయసులో 18 ఏళ్లు చిన్నవాడైన ఓ 23 ఏళ్ల యువకుడితో అఫైర్ కొనసాగించింది. ఆ వ్యవహారం కాస్తా భర్తకు తెలియడంతో చంపాలని ప్లాన్ చేశారు. తుపాకితో కాల్చి చంపాలని చూశారు. బుల్లెట్ తగిలినప్పటికీ ఆ వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ ప్రాంతానికి చెందిన బబిత(41), భీమ్‌రాజ్(45) భార్యాభర్తలు. పెళ్లయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. బీఎస్‌ఈఎస్‌లో భీమ్‌రాజ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు. బబిత ఇంటి వద్దే ఉంటూ పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే.. బబితకు రోహన్ అనే 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లుకు చనువుగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భీమ్‌రాజ్‌కు తెలియకుండా కొన్ని నెలలుగా బబిత, రోహన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒకరోజు.. బబిత, రోహన్ కలిసి ఉండగా భీమ్‌రాజ్ కంటపడ్డారు. ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ యువకుడు భయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. బబిత చేసిన పనికి భీమ్‌రాజ్‌కు ఒళ్లు మండి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇలాంటి పనిచేసేవేంటంటూ భార్యను అప్పటి నుంచి కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. భర్త కొడుతున్న విషయాన్ని తన ప్రియుడు రోహన్‌కు చేరవేసిన బబిత.. తన భర్త హత్యకు కుట్ర పన్నింది.

  బబిత, రోహన్ కలిసి భీమ్‌రాజ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. కారు డ్రైవర్‌గా వెళుతున్న భీమ్‌రాజ్ రోడ్డుపై కనిపించగానే.. అప్పటికే సిద్ధంగా ఉన్న రోహన్ బైక్‌పై భీమ్‌రాజ్‌ను వెంబడించి తుపాకితో కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ భీమ్‌రాజ్ మెడకు తగిలింది. స్థానికులు వెంటనే అతనిని ఎయిమ్స్‌కు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో భీమ్‌రాజ్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ కేసు విచారణలో భాగంగా రోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తొలుత ఏవేవో కథలు చెప్పాడు. తనకూ, భీమ్‌రాజ్‌కు తగాదాలు ఉన్నాయని.. ఆ కోపంతోనే కాల్చానని తెలిపాడు. పోలీసులకు రోహన్ చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు.

  ఇది కూడా చదవండి: Female Partner: అక్క ఇంట్లో అద్దెకు దిగిన కుర్రాడితో పరిచయం.. నాలుగేళ్ల నుంచి శారీరకంగా కలుస్తూనే ఉన్నారు.. ఇప్పుడేమైందంటే..

  భీమ్‌రాజ్ భార్యతో తనకు మూడునాలుగు నెలల నుంచి వివాహేతర సంబంధం ఉందని.. ఈ విషయం ఒకరోజు భీమ్‌రాజ్‌కు తెలిసిందని పోలీసులకు రోహన్ చెప్పాడు. అప్పటి నుంచి తన ప్రియురాలు బబితను కొడుతుండటంతో భీమ్‌రాజ్‌ను చంపాలని ఆమెతో కలిసి ప్లాన్ చేసినట్లు రోహన్ అంగీకరించాడు. పోలీసులు భీమ్‌రాజ్ భార్య బబితను, రోహన్‌ను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న బబిత చివరకు కటకటాల పాలైంది. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న యువకుడు రోహన్ పర స్త్రీ వ్యామోహంలో పడి 23 ఏళ్లకే జైలు జీవితం గడపాల్సి వచ్చింది. వివాహేతర సంబంధాలు చివరికి ఏ పరిణామాలకు దారితీస్తాయో రోహన్, బబిత వ్యవహారం చెప్పకనే చెబుతోంది.
  Published by:Sambasiva Reddy
  First published: