హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొడుకుతో తల్లి ఆ పని. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్. తీవ్ర దుమారం

కొడుకుతో తల్లి ఆ పని. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్. తీవ్ర దుమారం

కొడుకుతో తల్లి ఆ పని. (image credit - instagram)

కొడుకుతో తల్లి ఆ పని. (image credit - instagram)

ఏదో ఒకటి చెయ్యాలి... సోషల్ మీడియాలో కనిపించాలి... ఇదో టెండెన్సీ ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తోంది. టిక్‌టాక్ (Tiktok) ద్వారా ఇది బాగా అలవాటైంది. ఫలితంగా రేగిన దుమారం ఇది.

ఏ పని ఎప్పుడు చెయ్యాలి... ఏ పని ఎవరితో చెయ్యాలి... ఎవరితో ఎలా ప్రవర్తించాలి... ఇవన్నీ ఎవరూ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు... ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. కానీ ఢిల్లీకి చెందిన ఆ మహా తల్లి... అన్నీ వదిలేసింది. సిగ్గూ శరం లేకుండా... కొడుకుతో... అసభ్యకరమైన డాన్స్ (dirty dance) చేసింది. చిన్నారితో ఒళ్లంతా తడిమించుకుంది. ఆ పిల్లాడి వయసు అంతా కలిపి పది లేదా పన్నెండేళ్లు ఉండొచ్చు. తల్లి తనతో ఏం చేయిస్తుందో ఇంకా అర్థమయ్యే వయసు కాకపోవచ్చు. పాపులార్టీ కోసం ఇంత పని చేసింది. ఇదంతా వీడియో తీసి... ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెటిజన్లు ఊరుకుంటారా... తిట్టిపోశారు. బుద్ధిలేదా అంటూ ఫైర్ అయ్యారు.

పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే... ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. వెంటనే వాళ్లు అలర్ట్ అయ్యి... ఆ మహిళపై కేసు నమోదు చెయ్యమని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అలాగే ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి... పిల్లాణ్ని... సంరక్షణ కేంద్రానికి పంపాలని ఆదేశించింది. ఓ మహిళ అయివుండీ... పిల్లాడికి తల్లి అయివుండీ... అదే పిల్లాడితో... అలా ఎలా ప్రవర్తిస్తారనీ... తల్లిదనానికే మచ్చ తెచ్చిందని మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. పిల్లలకు నేర్పాల్సినవి ఇవేనా అంటూ గడ్డిపెట్టింది. ఇంత జరిగాక... కళ్లు తెరిచిన ఆ మహిళ... ఆ వీడియోని డిలీట్ చేసింది.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేసిన అకౌంట్‌కి 1,60,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్ర దుమారం రేగింది. దేనికైనా ఓ పద్ధతంటూ ఉంటుంది... ఇలాగా చేసేది... ఛీఛీ అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీని వల్ల పిల్లలు చెడిపోతారు... అంతేకాదు... తల్లీ పిల్లల మధ్య పవిత్ర బంధాన్ని కాలరాసినట్లే అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెద్దవాళ్లే ఇలాంటివి చేస్తే... రేపొద్దున ఆ పిల్లలు పెద్దవాళ్లై... సమాజానికి సమస్యగా మారరా... వాళ్ల మైండ్ సెట్ ఎలా తయారవుతుందో గ్రహించరా అని మరికొందరు నెటిజన్లు నిలదీస్తున్నారు.

"ఎవరైనా సరే తమ టాలెంట్ చూపించేందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్‌ఫామ్. అదే సమయంలో... కొంత మంది నేము, ఫేమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ ఘటనలో పది పన్నెండేళ్ల కొడుక్కి ఏది మంచో ఏది చెడో చెప్పాలి. అలాంటిది అ పిల్లాడి తల్లే చిన్నారితో.. పోర్నోగ్రఫీ వీడియో చేసింది. ఇలాగైతే ఎలా" అని ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal).

ఇది కూడా చదవండి: Viral Video: డాన్స్ స్టెప్స్... 814 మంది దగ్గర నేర్చుకున్నాడు... ఆ తర్వాత వీడియో చేశాడు

ప్రస్తుతం పోలీసులు ఆ వీడియో ఇంకా ఎక్కడైనా షేర్ అయ్యిందా, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఉందా అనేది పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Crime news, National News, VIRAL NEWS

ఉత్తమ కథలు