హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో.. వీడిదేం సైకో తెలివిరా నాయన.. చదువుకోవడం ఇష్టంలేదని ఏంచేశాడో తెలుసా..?

వామ్మో.. వీడిదేం సైకో తెలివిరా నాయన.. చదువుకోవడం ఇష్టంలేదని ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: బాలుడికి చదువంటే అసలు ఇష్టముండేది కాదు. కానీ ఇంట్లో వారి పొరుపడలేక బలవంతంగా స్కూల్ కు వెళ్లేవాడు. దీంతో అతను సైకోలా ఆలోచించడం ప్రారంభించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొందరు పిల్లలు చిన్నతనం నుంచే సైకోలుగా మారుతున్నారు. సినిమాలు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే విధానం వారిపైన విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు చుట్టుపక్కల వారు ఎలా ప్రవర్తిస్తుంటారో వారిని చూసి ఫాలో అవుతుంటారు. కొన్నిసార్లు.. మంచి కన్న, చెడు పిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందుకే చిన్నపిల్లలు కొందరు బూతులు మాట్లాడుతుంటారు. సినిమా డైలాగులు కొడుతుంటారు. మరికొందరు చిన్న వయసులోనే నేరస్థులుగా కూడా మారుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. ఢిల్లీలోని (Delhi)  మసూరీలోని మీరట్ లో షాకింగ్ ఘటన జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు, 13 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. బాలుడికి చదువంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అయితే.. చదువు నుంచి తప్పించుకొవడానికి తన ఇద్దరు స్నేహితులను మర్డర్ చేయడానికి ఐదునెలలుగా ప్లాన్ వేశాడు. దీంతో కారులో వెళ్దామని చెప్పి స్నేహితుడికి మాయమాటలు చెప్పాడు. అది నిజమని నమ్మిన అతగాడు వెళ్లాడు. అప్పుడు గాజుతో అతి గొంతులో కోశాడు.అనంతరం మృతదేహాన్ని ఎక్స్ ప్రెస్ వే పొదల్లో పడేసి పరారయ్యాడు. బాధితుడి తండ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. తన కొడుకు కోసం వెతికారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సమీపంలోని ప్రాంతానికి వెతకగా అతని మృతదేహాం దొరికింది. దీంతో మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తనకు ఇష్టంలేకున్న పట్టుపట్టి చదివిస్తున్నందుకు ఇలా చేశానని బాలుడు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


ఇదిలా ఉండగా ఒక కోడలిని అత్తింటి వారు అమానవీయంగా వేధించారు.


మహారాష్ట్రలోని (Maharashtra) పూణెలో షాకింగ్ ఘటన జరిగింది. 2013 లో మహిళకు ఒక నగల వ్యాపారితో పెళ్లయ్యింది. కొన్నిరోజుల పాటు బాగానేఉన్న ఆ తర్వాత నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన భర్త బంగారు ఆభరణాలను విక్రయించి, తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి ₹ 75 లక్షల రుణం తీసుకున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అప్పు కోసం తన భర్త తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని మహిళ ఆరోపించింది.


తన భర్తకు కొల్హాపూర్‌కు చెందిన ఒక క్షుద్రశాస్త్రవేత్తతో పరిచయం కలిగిందని, ఆమె "వ్యాపారంలో లాభాలు" కోసం కొన్ని వింత వింత పనులు చేస్తుండేవాడని తెలిపింది. కాగా, క్షుద్ర మాంత్రికుడు అయిన మౌలానా బాబా జమాదార్, ఆమె "మగ బిడ్డను కనేందుకు" ఆమెను పూర్తిగా ప్రజల దృష్టిలో జలపాతం కింద స్నానం చేయాలని చెప్పాడు. ఇలా చేస్తే వెంటనే మగ సంతానం కల్గుతారని అతనికి తెలిపాడు. దీంతో  రాయగఢ్‌కు తీసుకువెళ్లాలని మహిళ భర్తను, అత్తమామలు కోరినట్లు ఆమె తెలిపింది. దీంతో వారు నగ్నంగా స్నానం చేయాలని ఆమెను వేధించారు.దీంతో విసిగిపోయిన ఆమె పూణెలోని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, అత్తమామలు, క్షుద్ర మాంత్రికుడు సహా నలుగురిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.First published:

Tags: Crime news, Delhi

ఉత్తమ కథలు