విమానంలో మహిళతో ఆకతాయి వెకిలిచేష్టలు... ఆమె ముందు పాంట్స్ జిప్ తీసి...

Delhi : ఎవరైనా సరే వెధవ్వేషాలు వేస్తే... జైలుకు పంపిస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ... ఇప్పటికీ కొంతమంది ఆకతాయిలు అల్లరి చేష్టలు చేస్తూ బుక్కవుతూనే ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 26, 2019, 9:57 AM IST
విమానంలో మహిళతో ఆకతాయి వెకిలిచేష్టలు... ఆమె ముందు పాంట్స్ జిప్ తీసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం. కేరళ నుంచీ సౌదీ అరేబియా వెళ్తోంది. ఐతే... కేరళలోని కొట్టాయంకి చెందిన కుర్రాడు అబ్దుల్... సౌదీ అరేబియాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేందుకు వర్కింగ్ వీసాతో ఫ్లైట్ ఎక్కాడు. విమానం బయలుదేరింది. తన సీటులో కుదురుగా కూర్చోకుండా... విమాన సిబ్బంది ఉండే చోటికి వెళ్లాడు. అక్కడి ఓ మహిళ చూస్తుండగా సిగరెట్ వెలిగించుకోబోయాడు. ఆమె వెంటనే విమానంలో సిగరెట్ వెలిగించవద్దంది. వెలిగిస్తే ఏమవుతుంది... విమానం తగలబడిపోతుందా... అంటూ వెలిగించుకోబోతుంటే... ఆమె "ప్లీజ్ డోంట్ స్మోక్" అని ఎంతో మర్యాదగా చెప్పింది. సిగరెట్ డస్ట్ బిన్‌లో పడేయండి అంది. ఇదే విషయాన్ని తన తోటి ఉద్యోగులతో చెప్పింది. అంతే... "నేను సిగరెట్ వెలిగించుకుంటే నీ కేంటి బాధ... నీ సంగతి చెబుతా చూడు" అంటూ... ప్యాంట్స్ జిప్ తీశాడు. వెకిలి చేష్టలు చేశాడు. అడ్డమైన సైగలతో బూతు పురాణం మొదలుపెట్టాడు.

అబ్దుల్‌పై ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌లో కంప్లైంట్ నమోదైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (CISF) ఈ విషయం తెలుసుకున్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే... అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించాయి. అతనిపై సెక్షన్ 354 (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (వెకిలి చేష్టలు) కింద కేసు నమోదైంది.

 

ఇవి కూడా చదవండి :పాపం చిన్నారి... మరో గుడ్డు అడిగితే... సలసలా కాగే కిచిడీని మీద పోసి...

ఈ ఇంజెక్షన్ రేటు రూ.14 కోట్లు... ఎందుకో తెలుసా...

వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉండవల్లి... పోలవరం కోసం ఆయన సేవల్ని వాడుకుంటారా?చంద్రబాబుకు బస్తీ మే సవాల్... నేడు విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...
First published: May 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు