యువతి ప్రాణం తీసిన ప్రేమోన్మాది... దారుణానికి కారణం ఇదీ...

Delhi Crime : ప్రేమ, పెళ్లి... ఈ రెండు ఎవరి జీవితంలోనైనా ఎక్కువ ప్రభావం చూపే అంశాలు. మరి ఆ యువతి విషయంలో ఏం జరిగింది? ప్రేమించినవాడే ఎందుకు ప్రాణం తీశాడు?

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 9:00 AM IST
యువతి ప్రాణం తీసిన ప్రేమోన్మాది... దారుణానికి కారణం ఇదీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలోని... LNJP కాలనీ ప్రజలంతా షాకులో ఉన్నారు. ఎందుకంటే... తమ కాలనీకి చెందిన... ఎప్పుడూ వినని వార్తొకటి ఒకటి వాళ్లు విన్నారు. 32 ఏళ్ల మహమద్ ఆయూబ్ ఆ కాలనీలో నివసించేవాడు. అతనికి 2008లో పెళ్లైంది. నలుగురు పిల్లలున్నారు. అలాంటి వ్యక్తి... నాలుగేళ్ల కిందట... లతను చూశాడు. ఏముందిరా అనుకున్నాడు. నాకు పెళ్లి కాకపోయి ఉంటే... తిననే చేసుకునేవాణ్ని... అనుకున్నాడు. అక్కడితో ఆ విషయం వదిలేసివుంటే బాగుండేది. తరచూ ఆమె ఆ చుట్టుపక్కల కనిపిస్తుండటంతో... ఆమెతో మాట్లాడాలనీ, స్నేహం చెయ్యాలనీ అనిపించింది ఆయూబ్‌కి. మంచివాడిలా నటిస్తూ... మెల్లిగా ఆమెకు దగ్గరయ్యాడు. తనకు పెళ్లైన విషయం ఆమెకు చెప్పలేదు. కానీ కొన్నాళ్లకే ఆమెకు విషయం తెలిసిపోయింది. అప్పటి నుంచీ అవును నాకు పెళ్లైంది... నీతో ఫ్రెండ్షిప్పే చేస్తున్నాను అన్నాడు. సరే అనుకుంది. ఇలా నాలుగేళ్లు గడిచాయి.

ఇటీవల ఉద్యోగం చేసుకుంటున్న లతను పిలిచి... ఎంత ప్రయత్నించినా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఓ పని చెయ్... నీ జాబ్ మానేయ్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చక్కగా చూసుకుంటాను అన్నాడు. "ఏంటి చూసుకునేది... నీకు ఆల్రెడీ పెళ్లై, నలుగురు పిల్లలున్నారు. ఇలా మాట్లాడటానికి నీకు తప్పుగా అనిపించట్లేదా? పెళ్లైన వాణ్ని మళ్లీ పెళ్లి చేసుకోవాల్సినంత ఖర్మ నాకు లేదు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేనో మంచి అతన్ని పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అని సున్నితంగా చెప్పింది. ఆ టైంలో సరేనన్న ఆయూబ్... ఆ తర్వాత... ఆమెపై పగ పెంచుకున్నాడు.

"నన్ను వద్దంటుందా... నాలుగేళ్లు నాతో ఎందుకు తిరిగింది. అంత పనికిమాలిన వాడిలా కనిపిస్తున్నా... నన్ను మోసం చేసింది... నన్ను బాగా వాడుకుంది... ఇలాంటి వాళ్లకు ఈ భూమిపై బతికే హక్కు లేదు" అనుకున్నాడు. నాల్రోజుల తర్వాత... లత... ఈవెనింగ్ రైడ్‌కి వస్తావా... అన్నాడు... ఇదివరకూ చాలాసార్లు అలా వెళ్లిన ఆమె... సరేనని అతనితో బయల్దేరింది. సిటీ శివార్లకు ఆమెను తీసుకెళ్లాడు. ఇటువైపు మనం ఎప్పుడూ రాలేదు కదా అంది. అవును... ఇకపై ఎప్పుడూ ఇటు రాము... వస్తే నేను వస్తానేమోగానీ... నువ్వు మాత్రం రావు... అన్నాడు. ఏం... ఎందుకని అంది... ఎందుకంటే... నువ్వసలు బతికి ఉంటే కదా... అంటూ... ఆమె మీదకు ఉరికాడు.

షాకైన ఆమె... ఏం చేస్తున్నావ్... ఏంటిది అంటూ అతన్ని వెనక్కినెట్టేందుకు ప్రయత్నించింది. "దొంగ మొహం దానా... నన్ను ప్రేమించనప్పుడు నాతో ఈ తిరుగుళ్లెందుకు... ఈ డ్రామాలెందుకు... నన్ను పెళ్లి చేసుకోనంటావా... చావు... నువ్వు చావాల్సిందే" అంటూ ఆమె పీక పట్టుకోవాలని చూశాడు. "నా తప్పేముంది... నువ్వే కదా రాకపోతే... ఏడుపు మొహం పెడతావ్... నిన్ను బాధపెట్టడం ఎందుకులే అని వచ్చేదాన్ని. కానీ నువ్వింత డేంజర్ అనుకోలేదు" అంది. "ఛ... నీ నటనలు నా దగ్గర కాదు... నిన్నూ" అంటూ ఆమె పీక పట్టుకొని గట్టిగా నొక్కేశాడు.

చుట్టూ ఎవరూ లేని ప్రదేశం. ఆమె అరుపులు... అరణ్య రోదనలయ్యాయి. స్నేహితుడిలా నటించిన వ్యక్తే... ప్రాణం తీస్తుంటే... ఆ దుర్మార్గం నుంచీ తప్పించుకోలేక... అక్కడే విలవిలలాడింది. అలా ఎంత సేపు చేసినా... ఆమె చావకపోవడంతో... కత్తి తీసి... కసాకసా నాలుగు పోట్లు పొడిచాడు. అంతే... రక్తం... వాటర్ ట్యూబ్‌లో వాటర్‌లా... బాడీలోంచీ బయటకు తన్నుకొచ్చింది. ఆ రక్తాన్ని చూడగానే ఆమె సగం ప్రాణాలు పోయాయి. షాక్ లోకి వెళ్లిపోయింది. కొన్ని క్షణాలకే చనిపోయింది.

లత చనిపోయినా... ఆయూబ్‌లో కసి చల్లారలేదు. ఆమె బాడీని ముక్కలుగా నరికేశాడు. మర్నాడు ఎవరో చెప్పడంతో... పోలీసులు ఆ స్పాట్‌కి వెళ్లారు. పైన గద్దలు ఎగురుతున్నాయి. కింద కుళ్లిపోయిన డెడ్ బాడీ ఉంది. తల మాత్రం లేదు. ఆ తల ఏమైందా అని చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకి తరలించారు. అంతకు ముందు రోజే... లత మిస్సింగైనట్లు కంప్లైంట్ వచ్చింది. సో, డెడ్ బాడీ లతదేనని అర్థమైంది. ఆమె కాల్ డేటా చూశారు. విషయం అర్థమైంది. ఆయూబ్‌ని అరెస్టు చేశారు.

డెడ్ బాడీ తల ఏం చేశావని ప్రశ్నించారు. ఆ తలను అర కిలోమీటర్ అవతల ఉన్న ఓ చిన్న అడవిలోని... ఓ చెట్టుకి వేలాడదీశానని చెప్పాడు. పోలీసులు అక్కడకు వెళ్లి చూస్తే... తల లేదు. కానీ... తల వేలాడదీసినట్లు చెప్పిన చోట... కొన్ని రక్తపు మరకలున్నాయి. ఆ చుట్టుపక్కల వెతికినా తల దొరకలేదు. ఏ జంతువులో ఎత్తుకుపోయి ఉంటాయని భావించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Published by: Krishna Kumar N
First published: September 1, 2019, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading